కోలీవుడ్‌లోనూ కదంతొక్కుతున్న .. 'నాయక్‌'

By Srikanya

చెన్నై : రామ్ చరణ్ తాజా చిత్రం 'నాయక్‌'. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తమిళనాడు లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం తమిళంలోనూ సైమన్టీస్ గా విడుదల అవుతోంది. ఈ నేఫధ్యంలో తమిళ చిత్రానికి సంభందించి పోస్టర్స్ విడుదల చేసి, హంగామా క్రియేట్ చేసారు. మాతృభాషకే పరిమితమన్న హద్దుల్ని చెరిపేస్తున్నారు నేటి యంగ్ హీరోలు . పరభాషలోనూ మార్కెట్‌ పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రామ్‌చరణ్‌ ఈ ప్రయాణంలో అందరికంటే ముందున్నాడు.


చిరంజీవి నట వారసుడిగా 'చిరుత'తో తెలుగులో తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్‌ మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. తమిళతంబీలకు ఆయన్ను పరిచయం చేసిన సినిమా 'మావీరన్‌'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ రెండో చిత్రంగా వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించిన 'మగధీర'కు రీమేక్‌ ఇది.

ద్వితీయార్థంలో వచ్చే గ్రాఫిక్స్‌ మాయాజాలాన్ని పరిగణనలోకి తీసుకుని సుమారు ఏడాది తర్వాత 'మావీరన్‌' పేరిట తమిళంలో విడుదల చేశారు. ఇక్కడి ప్రేక్షకుల నుంచి కూడా చక్కని స్పందన లభించింది. ఈ ప్రోత్సాహమే తమిళంపై రామ్‌చరణ్‌ ప్రత్యేక దృష్టి సారించటానికి ప్రధాన కారణమైంది.

'రచ్చ'ను తెలుగులో విడుదలైన అదే రోజునే 'రగళై'గా థియేటర్లలోకి తీసుకొచ్చారు. ప్రారంభ వసూళ్లు బాగానే రాబట్టింది. ఆ వెంటనేతెలుగులో ఆయన తొలిచిత్రం 'చిరుత' 'సిరుత్త్తె పులి'గా వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్‌ లవ్‌స్టోరీ 'ఆరెంజ్‌' కూడా త్వరలో 'రామ్‌చరణ్‌'గా జనం మధ్యకు రానుంది. ఇటీవలే ఆడియో వేడుక కూడా జరుపుకుంది.

తాజాగా... చిరంజీవితో 'ఠాగూర్‌'లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించిన తాజాచిత్రం 'నాయక్‌'. 'మగధీర' తర్వాత కాజల్‌ మరోసారి చెర్రీ సరసన జంట చేరగా, అమలాపాల్‌ కొత్తగా ఆడిపాడింది. జనవరి 11న థియేటర్లలో సందడి చేయనుంది. దీనిని తమిళ ప్రేక్షకుల చెంతకు తీసుకొచ్చేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఆడియో విడుదలైన మరుసటి రోజే తమిళ 'నాయక్‌'కు సంబంధించిన వాల్ పోస్టర్లు చెన్నై నగరమంతా వెలిసి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X