నయనతారకు ఆ పిచ్చి కూడా
ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలంటే మక్కువ చూపిన నయనతార తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ అంటే ఆసక్తి చూపుతోంది. అరుంధతి హిట్టవటంతో ఆమె కూడా అదే దారిలో ప్రయాణం చేసి పేరు సంపాదించాలని చూస్తోంది. అందులోనూ ఎంతకాలం ఇలా గ్లామర్ డాల్స్ గా మిగిలిపోతాను అని వాదిస్తోంది. అనూష్క ధైర్యం చేసి జేజమ్మ లాంటి పాత్ర చేసింది కాబట్టే ఈ రోజున అంతటా ప్రశంసలు పొందుతోందని ఆమె మెచ్చుకుంటోంది. అందుకే తన పాత్ర చుట్టూ తిరిగే కథలకు ప్రయారిటీ ఇస్తానని ఆమె క్లియర్ గా నిర్మాతలుకు చెప్తోందని తెలుస్తోంది.
అయితే ఆమె శ్రేయాభిలాషులు మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లు చేస్తే తర్వాత పెద్ద హీరోలు ఎవరూ తమ ప్రక్కన ఛాన్స్ ఇవ్వరని చెప్తున్నారు. అయినా ఆమె పట్టు వీడక అలాంటి కథే చేస్తాను అంటోంది. ప్రస్తుతం చేస్తున్న ఆంజనేయులు, అదుర్స్ అనంతరం ఎట్టి పరిస్ధితిల్లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న కథనే ఒప్పుకోవాలని ఆమె పీఆర్వోకి సూచిందని చెప్తున్నారు. అందులోనూ ఎమ్.ఎస్.రాజు తన తర్వాత చిత్రాన్ని కోడిరామకృష్ణ దర్శకత్వలో నయనతార హీరోయిన్ గా ప్లాన్ చేయటానికి ఆసక్తి చూపటం కూడా ఈ నిర్ణయం ఇంత బలంగా ఉండటానికి ఒక కారణమంటున్నారు.


Click it and Unblock the Notifications











