పాపం..నయనతారకు నయా ట్విస్ట్!!

ఇక తర్వాత కాలచక్రం గిర్రున తిరిగి ఆమె స్టార్ హీరోయిన్ అయి తెలుగు,తమిళ భాషల్లో నెంబర్ వన్ స్ధానానికి ఎదిగింది. దాంతో రెమ్యునేషన్ కూడా రెట్టింపు చేసిందన్న సంగతి తెలిసిందే. ఇక అదే హిట్ మూడ్ లో ఎంత రెమ్యునేషన్ అయినా ఫరవాలేదని ఓ తమిళ డైరక్టర్ ఆమెతో కోటి పాతికకు ఓ ఎగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే ఆమె కథానాయుకుడు,సత్యం సినిమాలు డిజాస్టర్ ఫలితాలను భాక్సాఫీస్ వద్ద నమోదు చేయటంతో ఖంగు తిన్నాడు.
వెంటనే కంగారుపడి తాను అంత చెల్లించలేనని,అప్పట్లో మార్కెట్ పరిస్ధితి చూసి కంగారుపడ్డానని నయనతారని బ్రతిమిలాడాడు. ఒకరికి పోన్లే కదా అని తగ్గిస్తే అందరూ అదే దారిని పడతారని ఆమె ఒప్పుకోలేదు. అయితే అతను తమిళ సినీ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. వారు ఆమెకు విషయం తెలిపి ఇండైరక్ట్ గా బెదిరించి ఒప్పించారు. వారి మాట వినక పోతే అసలుకే మోసం వస్తుందనీ ఆమె సరేనంది. ఇక ఇది తెలుసుకున్న మిగతా నిర్మాతలు కూడా అదే దారిలో పయినించటానికి రెడీ అవుతున్నారు. పాపం నయనతార ఊహించని ఈ కొత్త ట్విస్ట్ కు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తోంది.పెర్గుట విరుగుట కొరకే కదా...అయినా అన్ని రోజులూ నయనతారవేనా?


Click it and Unblock the Notifications











