నెట్ ఫొటోలపై నయన ఫిర్యాదు
హాట్ స్టార్ నయనతార ఇప్పుడు పీకలోతు సమస్యలో ఇరుక్కుంది.ఆమె అశ్లీల వీడియోలు ఇప్పుడు నెట్ లో అనేక సైట్స్ లో దర్శనమిస్తున్నాయి.అయితే ఆ వీడియోస్ అన్నీ గ్రాఫిక్స్ మాయాజాలం అని, ఫ్రొఫెషనల్ జెలసీతో శతృవులు చేస్తున్న దాడి అని,తనని బ్యాడ్ చేసి పరిశ్రమలో లేకుండా చేయటమే వారి లక్ష్యంమని చెప్పుతూ నయనతార గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చింది.అయితే ఆ వీడియోలు రెట్టించిన ఉత్సాహంతో నెట్ ని ఆక్రమించటంతో ఆమె కంగారుపడి క్రిందటవారం చెన్నై మెట్రో పోలీసులుకు పిర్యాదు చేసింది.వారిని ఆ వీడియోలు అరికట్టమని కోరింది.
తర్వాత చెన్నై పోలీసులు ఆ వీడియోలను కాప్చర్ చేసి ఆమె చెబుతున్నట్లు గ్రాఫిక్స్ వేనే అనే నిజ నిర్ధారణకు ఫోర్సినిక్ ల్యాభ్ కి పంపారు. సైబర్ క్రైమ్ వింగ్ ఇప్పటికే దీన్ని సీరియస్ తీసుకుని రంగంలోకి దూకింది.వారు నెట్ లో ఆ వీడియోలు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమయ్యారు.అయితే నయనతార మాత్రం ఈ చర్యలకు సంతృప్తి చెందక జాతీయ మానవ హక్కుల కమీషన్ కి ఫిర్యాదు చేసి వారి ద్వారా ఒత్తిడి తేవాలని ఆలోచిస్తోందిట.


Click it and Unblock the Notifications











