నయనతార-ప్రభుదేవ విడిపోవుటకు కారణం జ్యోతిష్యమా? ప్లాపా?
నయనతార, ప్రభుదేవా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని..ప్రేమ నడుస్తోందని...త్వరలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఆమధ్య వాపించాయి. అవి కేవలం రూమర్స్ గా ఇద్దరూ కొట్టపారేశారు. కెరీర్ డౌన్ ఫాల్ లో నడుస్తున్న కారణం రీత్యా..తల్లిదండ్రులు, అత్యంత సన్నిహితుల ఒత్తిడి మేరకు ప్రభుదేవాకు దూరంగా ఉండాలని నయనతార నిర్ణయించుకుంది. 'విల్లు" అనే తమిళ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తుండగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రభుదేవాతో లవ్ ఎఫైర్ నేపథ్యంలో నయనతార పేరెంట్స్ అప్సెట్ అయ్యారు.
నయనతార నటించిన మూడు చిత్రాలు 'కుచేలన్" (తెలుగులో కథానాయకుడు), 'సత్యం" (తెలుగులో సెల్యూట్), విల్లు(తమిళం) వరుసగా ఫ్లాప్ అవడం..ప్రభుదేవాతో ఎఫైర్ పూర్తి స్థాయిలో తలకెక్కడంతో సినిమా కెరీర్ దెబ్బతినేలా ఉందని నయనతార తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ప్రముఖ జ్యోతిష్యుణ్ణి కలిసి నయనతార జాతకం చూపించారట! జ్యోతిష్యుని ఏం సలహాలు ఇచ్చారోగానీ...ఇక నుండి కెరీర్ పైనే దృష్టి పెట్టాలని నయనతార నిర్ణయించుకుందట! ప్రస్తుతం ఆమె తెలుగులో 'జానియర్ ఎన్టీఆర్" సరసన 'అదుర్స్" చిత్రంలోనూ, ఆధవాన్(తమిళం), బాడీగార్డ్(మలయాళం) చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది, 'అరుంధతి" స్థాయిలో రూపోందే ఓ తెలుగు లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటించనుంది. దీన్ని కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం. ఎస్. రాజు నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











