For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతార లైఫ్‌లో దారుణమైన దెబ్బ.. శింబుతో బ్రేకప్‌కు కారణం అదే

  |

  గజని, చంద్రముఖి చిత్రాలతో అనూహ్యంగా దూసుకొచ్చిన అందాల భామ నయనతారకు ఆ తర్వాత ఎదురే లేకుండా పోయింది. దక్షిణాదిలోని అన్నిభాషల్లో ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న రోజులు అవి. అగ్రతారగా నయన ఎదిగిపోయిన సమయం. ఆ క్రమంలోనే శింబుతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. అయినా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ హీరోయిన్‌గా తన ప్రస్తానాన్ని కొనసాగింది. అయితే పెళ్లి పీటల వరకు వస్తుందనుకొన్న శింబుతో అఫైర్ అర్ధాంతరంగా బ్రేకప్ అయింది. అందుకు ఒకే ఒక కారణం..

  శింబుతో అఫైర్ అతి గాఢంగా

  శింబుతో అఫైర్ అతి గాఢంగా

  నయనతార, శింబు లవ్ లైఫ్, రొమాన్స్ తెర మీద కంటే బయటనే ఎక్కువగా పండింది. ముద్దులు, కౌగిలింతలు, అతిసన్నిహితమైన వారి కలయిక మీడియాకు, అభిమానులకు పండుగలా మారాయి. ప్రపంచాన్ని పట్టించుకోకుండా ప్రేమలో మునిగిపోయారు. ఆ సమయంలోనే వారిద్దరి ముద్దు ఫోటో మీడియాలో లీక్ కావడంతో వారి రిలేషన్ షిప్‌కు గట్టి దెబ్బ పడిందని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

   తెర మీద కంటే..

  తెర మీద కంటే..

  నయన, శింబు నటించిన వల్లభ సినిమాలో కెమిస్ట్రీ తెర మీదే కాదు.. తెర వెనుక కూడా బాగా పండింది. వారి రిలేషన్ బ్రహ్మండంగా సాగింది. అలాంటి సమయంలో నయన, శింబు అతి గాఢంగా పెట్టుకొన్న ముద్దు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోనే వారిని శాశ్వతంగా ఒకరిని మరొకరికి దూరం చేసింది.

   ముద్దు ఫోటో సోషల్ మీడియాలో

  ముద్దు ఫోటో సోషల్ మీడియాలో

  తమ మధ్య సీక్రెట్‌గా ఉండే ముద్దు ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడానికి కారణం శింబునే అనే అనుమానం నయనతారలో మొదలైంది. అయితే తన తప్పేమి లేదు. తన ప్రమేయం లేకుండానే ఫోటో సోషల్ మీడియాలో లీకైందని శింబు చెప్పిన మాటలు నయనను మెప్పించలేకోపోయాయి. దాంతో వారిద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయింది.

  శింబు మాటలు మెప్పించలేకపోగా..

  శింబు మాటలు మెప్పించలేకపోగా..

  నయనతారను ఒప్పించడానికి శింబు చాలా ప్రయత్నించారని, అయితే ఆమె అప్పటికే తీవ్రంగా మనస్తాపం చెందడంతో అతడి వాదన వారి ప్రేమను కాపాడలేకపోయింది. కొత్తగా కొన్ని కెమెరా క్లారిటీ చూడటానికి ఆ ఫోటో తీశానని, కానీ అది తన ప్రేమయం లేకుండా ఇతరుల చేతుల్లో పడిందని చెప్పిన మాటలు నయన చెవికి చేరలేకోయాయి. ఆ విధంగా నయనతార, శింబు ప్రేమకథకు ఆ విధంగా పుల్‌స్టాప్ పడింది.

   మానసికంగా మరింత ధృడంగా

  మానసికంగా మరింత ధృడంగా

  తన జీవితంలో మానసిక క్షోభకు గురైన ఆ సంఘటన నుంచి కోలుకొనే సమయంలో ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ప్రభుదేవా కోసం ఆమె మతం మార్చుకొనేంతగా తన ప్రేమ ప్రభావం చూపింది. కానీ అందరూ ఊహించని విధంగా 2012లో ప్రభుదేవాతో కూడా బ్రేకప్ జరిగిన విషయం తెలిసిందే.

  Darbar Pre Release Event : 'Darbar Is My Dream Project' Says Anirudh Ravichander
  లేడీ సూపర్‌స్టార్‌గా

  లేడీ సూపర్‌స్టార్‌గా

  శింబు, ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయనతార మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా మారిందని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. సినిమాలో ఎంపికలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నాన్నమ్ రౌడీ ధాన్, ఆరంభమ్, ఆరమ్, బిగిల్, డోరా, కొలమాను కోకిల, ఇమైక్కా నోడిగల్, ఐరా, కొలైయూథిర్ కాలమ్ లాంటి విజయాలను తన ఖాతాలో వేసుకొన్నారు. ప్రస్తుతం లేడి సూపర్‌స్టార్ ట్యాగ్‌తో దూసుకెళ్తున్నారు.

  English summary
  Nayanatara breakup with Simbu: When Nayanthara career graph in high point, She falls into a relationship with Actor Simbu. But, the relationship didn't last long, and everything happened due to a KISS photo which leaked in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X