అంతా విధిరాత.. 100 శాతం అర్పించుకొన్నా,.. ప్రభుదేవాతో బ్రేకప్‌పై నయనతార

డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, స్టార్ హీరోయిన్ నయనతార మధ్య అఫైర్ వ్యవహారం అప్పట్లో దక్షిణాది చిత్ర పరిశ్రమను కుదిపేసింది. వారిద్దరూ పీకల్లోతూ రిలేషన్‌షిప్‌లో మునిగిపోయారు. నయనతార కోసం ప్రభుదేవా తన 15 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పారు. పెళ్లి వరకు వచ్చిన వారి రిలేషన్‌షిప్‌కు అర్ధాంతరంగా బ్రేక్ పడటం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సమయంలో నయనతార స్పందించిన తీరు చాలా ఆసక్తిని కలిగించింది. వివరాల్లోకి వెళితే..

శ్రీరామరాజ్యం షూటింగ్‌లో

శ్రీరామరాజ్యం షూటింగ్‌లో

ప్రభుదేవాతో రిలేషన్‌షిప్ పెళ్లి వరకు రావడంతో నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆ సమయంలో బాపు, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీ రామరాజ్యం చిత్రం షూటింగ్ జరుగుతున్నది. ఆ సమయంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగిసిన సమయంలో తనకు ఇదే చివరి సినిమా అని నయనతార కన్నీళ్లు పెట్టుకొన్నారు. దర్శకుడు బాపుతోపాటు చిత్ర యూనిట్ సభ్యులంతా నయనతారను ఓదార్చారు. ఇక పెళ్లి జరుగుతుందని ఊహించిన వారికి వారిద్దరి బ్రేకప్ షాకిచ్చింది.

నా వంతు 100 శాతం ఇచ్చేసా

నా వంతు 100 శాతం ఇచ్చేసా

ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయనతార మాట్లాడుతూ.. నేను రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో నా వంతుగా నేను 100 శాతం సహకారం అందించాను. రిలేషన్‌షిప్ బలమైన బంధంగా మారడానికి నా వంతు బాధ్యతను నేను అందించాను. అది నాకు మంచి ఫలితాలు ఇవ్వకపోతే నా తప్పు కాదు. నా జీవితానికి మంచి జరగనప్పుడు ఆ బంధాన్ని నేను ఎందుకు భరించాలి అంటూ నయనతార అన్నారు.

బ్రేకప్ దురదృష్టకరం

బ్రేకప్ దురదృష్టకరం

నా జీవితంలో ఇలాంటి బ్రేకప్ చాలా దురదృష్టకరం. నా జీవితంతో విధి ఆడిన నాటకమైనా అనుకోండి.. లేదా నా జీవితానికి మరో మలుపు అనుకొన్న నాకు ఇబ్బంది ఏమీలేదు. మేమిద్దరి కలిసి ఉండటం సాధ్యపడదని విధి తేల్చింది. దానిని ఎవరూ కాదనలేరు. అందుకే నా ప్రేమకు, నేను ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యాను అని నయనతార వేదాంతం వల్లించారు.

మానసికంగా కుంగిపోయి

మానసికంగా కుంగిపోయి

ఎవరైతే గొప్పగా మలుకొన్న బంధం సాధ్యపడకపోతే జీవితం ఓ కుదుపుకు గురవుతుంది. దాంతో మనిషి మానసికంగా కుంగి పోతారు. అలాంటి విషయాల నుంచి ఎంత త్వరగా బయటపడ్డామనేది చాలా ముఖ్యం. మూడున్నర ఏళ్లపాటు నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కానీ ఆ బంధాన్ని అంత త్వరగా తుంచుకోవడం సాధ్యం కాకపోయినా వాస్తవాన్ని గ్రహించాలి అంటూ నయనతార ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

Salman Khan Clash with Jackie Shroff for Sangeeta Bijlani Now Goes Viral
విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌షిప్

విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌షిప్

ప్రభుదేవాతో అఫైర్‌కు ముందు శింబుతో నయనతార పీకల్లోతు అఫైర్‌లో మునిగిపోయారు. ఆ తర్వాత బ్రేకప్ జరగడంతో ప్రభుదేవాతో బంధాన్ని పెంచుకొన్నారు. ఇప్పుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. అంతేకాకుండా కెరీర్‌ను బ్రహ్మండంగా పరుగులు పెట్టిస్తున్నారు. సోలో హీరోయిన్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X