ప్రభుదేవాకి బంపర్ ఆఫర్ ఇచ్చిన నయనతార...!?

By Sindhu

ప్రియురాలి కోసం మొదటి భార్యకు విడాకులిచ్చి, పిల్లల ఎడబాటును భరించలేక అల్లాడిపోతున్న ప్రభుదేవాకు కాస్త ఊరట లభించింది. ఆయన మొదటి భార్య సంతానాన్ని కలుసుకునేందుకు ప్రియురాలు నయనతార అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుదేవా కాస్త ఉల్లాసంగా కనిపిస్తున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొదటి భార్య రమలత్ తో విడాకుల అనంతరం కూడా ప్రభుదేవా తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇటీవల విదేశాలకు వెళ్లి రావడంతో నయనతార ఆగ్రహించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంలో ప్రభుదేవాకు దూరంగా జరిగిన నయనతార కేరళకు వెళ్లిపోయింది. దీంతో ఆమెను వెతుక్కుంటూ ప్రభుదేవా నయన ఇంటికి వెళ్లగా, ఆమె కనీసం ఇంటి తలుపు కూడా తీయనట్లు సమాచారం. దీంతో వారి సంబంధం తెగిపోయినట్లేనని వార్తలు వెలువడ్డాయి. అయితే తాము పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ నయనతార వివరణ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రభుదేవా తరచుగా తన ఇద్దరు పిల్లలతో కనిపిస్తున్నాడు. తన పిల్లల్ని వదల్లేకపోతున్నానని ప్రభుదేవా వాపోతుండటంతో, గొడవలెందుకని నయనతార అతని కోరికను మన్నించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అడయార్ బోట్ క్లబ్ లోని ఓ అద్దె ఇంట్లో కలిసి జీవిస్తున్న ప్రభుదేవా, నయనతార ప్రేమికుల దినమైన ఫిబ్రవరి 14, 2012న వివాహం చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X