రజనీతో నయనతార ఆటా-పాట
వచ్చే ఏడాది విడుదలయ్యే మేటి సంచలన చిత్రాలలో - శివాజీ ఒకటి. రజనీకాంత్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతంతో విడుదలవుతున్న ఈ చిత్రం దక్షిణాదితో పాటు తమిళ, తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న ఇతర దేశాలలో కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇప్పుడు ఈ చిత్రానికి తాజా ఆకర్షణగా నిలుస్తోంది - నయనతార. శివాజీ చిత్రంలో వచ్చే తొలి పాటలో రజనీకాంత్ సరసన నయనతార డాన్స్ చేయబోతోంది. మొదట్లో ఈ పాట కోసం సెక్సిణి మల్లికా షెరావత్ నుంచి ఆసిన్ వరకూ చాలా పేర్లు పరిశీలించినా చివరికి నయనతారకే అంతా వోటేశారు.
తమిళనాట నయనతార హవా ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ దీపావళికి ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ, వల్లవాన్, తలైమగన్ .. చిత్రాలలో నయనతార అందాలొలికించగా, తాజాగా శివాజీ చిత్రంలో ఐటెమ్ నెంబర్ చేసే అవకాశం రావడంతో మరింత లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. శంకర్ చిత్రాలలో ఐటెమ్ నెంబర్‌లు ఎప్పుడూ మిగతా పాటల కన్నా హిట్ అవుతుంటాయి.
జెంటిల్మెన్ చిత్రంలో చికుబుకు రైలే.. పాటలో గౌతమి, ఒకే ఒక్కడు చిత్రంలో షకలక బేబీ పాటలో.. సుస్మితా సేన్ శంకర్ చిత్రాలలో ఐటెమ్ సాంగ్స్ చేసి జనాన్ని అలరించారు. ఇప్పుడు ఆ ఛాన్స్ సొంతం చేసుకున్న నయనతార చంద్రముఖి చిత్రం తర్వాత రజనీతో మళ్లీ కలిసి నటించడంపై ఎంతో సంతోషంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications