సరికొత్త వివాదంలో నయనతార.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంపై రగడ
దక్షిణాది లేడి సూపర్‌స్టార్ నయనతార తన ప్రియుడి విఘ్నేష్ శివన్‌తో కలిసి చెన్నైలో కోవిడ్‌పై పోరాడే వ్యాక్సిన్ తీసుకోవడం మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయింది. మంగళవారం ఆమె వ్యాక్సిన్ తీసుకొన్నట్టు ఫోటోలను షేర్ చేసింది. అయితే ఫోటోలు ఇప్పుడు నయనతారను వివాదంలోకి నెట్టాయి.
నయనతార వాక్సిన్ తీసుకొన్నట్టు షేర్ చేసిన ఫోటోలో నర్సు చేతిలో సిరంజీ లేకపోవడంపై నయనతారపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోటోకు ఫోజివ్వడానికే ఆమె అలా వ్యవహరించిందా అనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు సరైనవి కావు. వాటిలో అంతా తప్పే ఉంది. మార్పింగ్ చేసి పోస్టు చేసి ఉంటారనే అభిప్రాయాన్ని నయనతార వర్గాలు పేర్కొన్నాయి. నయనతార వ్యాక్సిన్ తీసుకొన్నట్టు క్లియర్‌గా నర్సు చేతిలో సిరంజీ ఉన్న ఫోటోను షేర్ చేసి వివాదానికి తెర దించే ప్రయత్నం చేశారు. అయినా కొందరు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వ్యాక్సిన్‌ను అందరూ తీసుకోవాలని ప్రోత్సహించేలా నయనతార అవగాహన కల్పించడంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రజనీకాంత్, కీర్తి సురేష్, కుష్బూతో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్ర షూటింగులో కుష్భూ, కీర్తి సురేష్, ప్రకాశ్ రాజ్, మీనా తదితరుల పాల్గొంటున్నారు. అలాగే సమంత, విజయ్ సేతుపతితో కలిసి వాకులా రెండు కాదల్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో సమంత కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











