నయనతార ‘నైట్ షో’ విశేషాలు...
హైదరాబాద్: నయనతార త్వరలో ‘నైట్ షో' అనే తమిళ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక ప్రయోగాత్మక సినిమా. ఆరి అనే అప్ కమింగ్ యాక్టర్ ఈచిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార తల్లిపాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో అసలే పాటలే లేకుండా తెరకెక్కించారు. అయితే సినిమా ప్రచారం కోసం ఇటీవల శ్వేతా మోహన్ తో ఓ సాంగు రికార్డు చేయించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా చేయడం అంటే నయనతార సాహసం చేయడమే అంటన్నారు. ఈ మధ్యకాలంలో నయనతార వరసగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్యన శేఖర్ కమ్ముల తో కలిసి కహాని రీమేక్ లో చేసిన ఆమె ఇప్పుడు ఈ తమిళ హర్రర్ చిత్రం కమిటైంది.

ఈ చిత్రాన్ని అశ్విన్ శరవణ్ అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నారు.ఇది చాలా చిన్న బడ్జెట్ చిత్రం. దీంతో చిన్న స్థాయి నటి కోసం దర్శక నిర్మాతలు తొలుత ప్రయత్నించారు. అయితే ఈ స్క్రిప్టు గురించి తెలుసుకున్న నయనతార, పిలిచి మరీ చేస్తానని చెప్పటంతో వారి ఆనందానికి అంతేలేకుండా పోయిందని టాక్. స్క్ర్రిప్టు బాగా నచ్చటంతో ఆమె ఇష్టపడి చేస్తోందని చెప్తున్నారు. రెమ్యూనరేషన్ కూడా మామూలు సినిమాల కంటే తక్కువే తీసుకుంటుందన నయనతార.
నయనతార ఇతర సినిమాల గురించిన వివరాల్లకి వెళితే...తెలుగులో చివరగా అనామిక చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ‘ఐదు నమ్మ ఆలు', ‘నాన్ బెండ', ‘తాని ఒరువన్', ‘మాస్' అనే తమిళ చిత్రాల్లో నటిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో టాప్ పొజిషన్లో కొనసాగుతుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











