నయన్-ప్రభు దాగుడుమూతలెందుకు?
శింబుతో ప్రేమ? ప్రభుదేవాతో ప్రేమ? ఏది నిజం? శింబుతో ప్రేమలో పడినప్పుడు కూడా నయనతార అతనితో స్వేచ్చగా తిరగడానికి సంకోచించలేదు. మరి ప్రభుదేవా మాటేంటి? పెళ్లయి పిల్లలున్న ప్రభుదేవాతో కూడా అదే రీతిలో వ్యవహరించడం మాత్రం అందరినీ మభ్యపెడుతోంది. ఈ మద్య వచ్చిన వార్తల్లో నయనకి ప్రభుదేవాతో ఎలాంటి సంబంధం లేదంటూ, మేము మంచి స్నేహితులు మాత్రమేనని మీడియాని ఆకర్షించే విధంగా సన్నాయినొక్కులు నొక్కింది. దాంతో ఊరుకుండక దాగుడుమూతల దండాకోరూ అంటూ ముంబాయి చెక్కేసింది ఎందుకో తెలుసా ప్రభుదేవా డైరెక్ట్ చేసిన 'వాంటెడ్" సినమా చూడ్డానికి. ఇక్కడే ఆమె కోసం స్పెషల్ షో వేస్తానని ప్రభుదేవా చెప్తే కూడా వినకుండా జనం మధ్య చూస్తేనే మజా అంటూ బాంద్రాలోని సినీమాక్స్ కి లాక్కుపోయింది. అయితే మళ్ళీ అక్కడ మీడియా దష్టిలో పడ్డారు. త్వరలోనే నయనతారని బాలీవుడ్ ఆడియన్స్ కి ప్రభుదేవా పరిచయం చేస్తాడని కూడా అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. నయన్ ప్రభూల పయనం ఇక ఎంత వరకూ వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











