దుమ్మురేపుతున్న నయనతార.. మూడు రోజుల్లో 10 కోట్లు!

By Rajababu

Recommended Video

Nayanthara's Kolamaavu Kokila Gets A Positive Feedback

సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్లు తప్ప, లేడి సూపర్‌స్టార్లు చాలా అరుదుగా కనిపిస్తారు. లేడి సూపర్‌స్టార్ అంటే శ్రీదేవి చటుక్కున గుర్తుకొస్తారు. ఆ తర్వాత విజయశాంతి లాంటి వాళ్లు ఆ ట్యాగ్‌ను సొంతం చేసుకొనేందుకు ప్రయత్నించారు. చాలా ఏళ్ల తర్వాత దక్షిణాదిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నయనతార‌ను లేడి సూపర్‌స్టార్ అని పిలుస్తున్నారు. అందుకు కారణాలు ఇవే..

సోలో హీరోయిన్‌గా సూపర్‌హిట్లు

సోలో హీరోయిన్‌గా సూపర్‌హిట్లు

గతంలో అగ్రహీరోల చిత్రాల్లో నటించిన నయనతార‌ గ్లామర్, పాటలకు మాత్రమే పరిమితమైంది. గత రెండు, మూడు ఏళ్లుగా సోలో హీరోయిన్‌గా నయనతార విభిన్నమైన చిత్రాలతో దుమ్మురేపుతున్నారు. ఆమె నటించిన మాయా, డోరా, ఆరంభ్ చిత్రాలు సిని విమర్శకుల ప్రశంసలే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పంట పండించాయి.

నయనతార ఖాతాలో మరో బ్లాక్‌బాస్టర్

నయనతార ఖాతాలో మరో బ్లాక్‌బాస్టర్

తాజాగా నయనతార నటించిన చిత్రం కొలమావు కోకిల. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన తమిళనాడులో లభిస్తున్నది. తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ అనే టాక్‌ను సొంతం చేసుకొన్నది. స్టార్ హీరో లేకుండానే భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం తెలుగులో కోకో కోకిల అనే పేరుతో విడుదల కానున్నది.

మూడు రోజుల్లో 10 కోట్లు

మూడు రోజుల్లో 10 కోట్లు

కొలమావు కోకిల చిత్రానికి తమిళంలో ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. గత మూడు రోజుల్లో రూ.10 కోట్ల వసూళ్లు సాధించింది. పాజిటివ్ రివ్యూలు రావడం, ప్రేక్షకుల మౌత్ వర్డ్‌ ప్రచారంతో ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తున్నది.

కొలమావు కోకిల స్టోరి

కొలమావు కోకిల స్టోరి

కొలమావు కోకిల సంప్రదాయ కుటుంబానికి చెందిన ఓ యువతి పాత్రలో నయనతార కనిపించారు. క్యాన్సర్ వ్యాధికి గురైన తన తల్లి ప్రాణాలను రక్షించుకోవడానికి డ్రగ్స్ మాఫియాలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డ్రగ్ డీలర్‌గా ఏలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందనే చిత్ర కథ. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మరోసారి కొత్త దర్శకుడితో

మరోసారి కొత్త దర్శకుడితో

తనకు తాను నిరూపించుకోవాలనే ఓ ఫైర్ కొత్త దర్శకుల్లో ఉంటుంది. అందుకే కొత్త దర్శకులతో పనిచేయాలని ఆసక్తిగా ఉంటుంది. నూతన దర్శకుల్లో రూపొందించే స్క్రిప్టుల్లో వైవిధ్యం ఉంటుంది. అందుకే నేను నటించే సినిమా కథలు అత్యంత విభిన్నంగా ఉండి ప్రేక్షకులను రంజింప చేస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X