Surrogacy ఆమె అద్దె గర్బంతోనే కవల పిల్లలు.. సీక్రెట్ బయటపెట్టిన నయనతార
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార దంపతులు సరోగసి (అద్దె గర్బం) ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వివాదాస్పదంగా మారింది. అయితే పెళ్లి జరిగిన 4 నెలలోపే పిల్లల్ని కనడం చట్టాలకు వ్యతిరేకమనే విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొన్నది. సర్రోగసి ద్వారా పిలల్ని కనాలనే విషయంపై తమిళనాడు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, చట్టాలను అనుసరించారా? లేదా? అంటూ తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద అంశాలపై నయనతార ఇచ్చిన వివరణ ఏమిటంటే?

తమిళనాడులో కఠిన నిబంధనలు
సరోగసి ద్వారా పిల్లల్ని కనాలంటే తమిళనాడులో తీవ్రమైన నిబంధనలు ఉన్నాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. రిప్రోడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అండ్ ది సరోగసి యాక్ట్ 2021 ప్రకారం.. కనీసం ఐదేళ్ల వివాహం తర్వాత ఈ పద్దతిలో పిలల్ని కనాలి. అలాగే దంపతుల్లో భార్య వయసు 25 నుంచి 50 ఏళ్లు, భర్త వయసు 26 నుంచి 55 ఏళ్లు కచ్చితంగా ఉండాలి అని చట్టాలు వెల్లడిస్తున్నాయి.

సరోగసి మహిళ వయసు గురించి
అద్దె గర్బం ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకొంటే.. ఏ దంపతులైనా వారి సమీప బంధువును ఎంచుకోవాలి. అలాగే సరోగసికి ఉపయోగించే మహిళకు అప్పటికే సంతానం ఉండాలి. ఆమె వయసు కూడా 35 ఏళ్ల లోపు ఉండాలి. అప్పుడే ఆ మహిళకు సరోగసి ద్వారా పిల్లలను కనడానికి అర్హత ఉంటుంది అని సరోగసి చట్టాలు వెల్లడించాయి.

పెళ్లి జరిగి 4 నెలల పూర్తి కాకముందే
నయనతార, విఘ్నేష్ శివన్ తమకు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి జరిగి 4 నెలల పూర్తి కాకముందే సంతానం ఎలా కలుగుతుందనే సందేహాలను పలువురు వ్యక్తం చేశారు. సామాజిక సంఘాలు అనేక ప్రశ్నలు లెవనెత్తాయి. దాంతో తమిళనాడు ఆరోగ్యమంత్రి సుబ్రమణ్యం ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

ఆరు సంవత్సరాల క్రితమే పెళ్లి
తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు నయనతార దంపతులు స్పందించారు. ప్రభుత్వం పేర్కొన్న అన్నీ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించారు. జూన్ 9వ తేదీన పెళ్లి జరిగింది. కానీ మా మ్యారేజ్‌ను ఆరు సంవత్సరాల క్రితమే నమోదు చేసుకొన్నామని వివాహ ధృవీకరణ పత్రాన్ని సమర్పించారు. తాము నిబంధనలకు అనుగుణంగానే సంతానాన్ని స్వీకరించాం అని నయనతార దంపతులు వివరణ ఇచ్చారు.

దుబాయ్‌కి చెందిన మహిళ అంటూ
ఇక సరోగసికి ఉపయోగించే మహిళ తమ కుటుంబానికి చెందిన వారే ఉండాలనే నిబంధన విషయాన్ని కూడా ప్రభుత్వానికి వెల్లడించారు. తాము ఉపయోగించుకొన్న అద్దె గర్బం మా కుటుంబానికి చెందిన వ్యక్తినే. దుబాయ్‌లో బిజినెస్ చేస్తుంటారు. చెన్నైలోని హాస్పిటల్‌లో కవల పిల్లలు పుట్టారు. అందుకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశాఖకు నయనతార దంపతులు అందజేశారు.


Click it and Unblock the Notifications











