Nayanthara Wedding: పెళ్లి పందిట్లో నయన్ కు విగ్నేష్ ముద్దు.. మొదటి ఫొటో రిలీజ్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో పాపులర్ లవ్ బర్డ్స్ అయినటువంటి నయనతార విగ్నేష్ శివన్ మొత్తానికి పెళ్లి బంధంతో మరొక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. గత రెండేళ్లుగా వీరి పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు ఓ వర్గం అభిమానుల్లో కన్ఫ్యూజన్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా హిందూ సంప్రదాయం ప్రకారం గురువారం పెళ్లి చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మొదటి ఫోటోలో విగ్నేష్ శివన్ తన భార్యను ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఒక వివరణ కూడా ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

హిందు సంప్రదాయం ప్రకారం

హిందు సంప్రదాయం ప్రకారం

స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నయనతార తన బాయ్ ఫ్రెండ్ చేత మూడు ముళ్ళు వేయించుకొని సరికొత్త దాంపత్య జీవితానికి సిద్ధమయింది. వీరి పెళ్లికి సంబంధించి గత కొన్ని వారాలుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మహాబలిపురంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఇద్దరు ఏడడుగులు వేశారు.

 పెళ్లిలో సెలబ్రెటీలు

పెళ్లిలో సెలబ్రెటీలు

వీరి పెళ్లికి కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చారు. కొంతమంది సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ కొత్త దంపతులను దీవించేందుకు వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పెళ్లి ఖర్చు మొత్తం తనదే..

పెళ్లి ఖర్చు మొత్తం తనదే..

నయనతార పెళ్లి వేడుక కోసం గత రెండు వారం రోజులుగా మహాబలిపురంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. కేవలం అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి వేడుకను నయనతార కుటుంబ సభ్యులు నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకోసం నయనతార భారీగానే ఖర్చు చేసినట్లు సమాచారం.

ఫస్ట్ ఫొటో రిలీజ్

ఫస్ట్ ఫొటో రిలీజ్

ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోను దర్శకుడు విగ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. అందులో నయనతారను విగ్నేష్ చాల ప్రేమగా ముద్దు పెడుతున్నట్లు స్టిల్ ఇచ్చాడు. ఇక ఆ ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ కొత్త జంటకు ప్రత్యేకంగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

విగ్నేష్ స్పెషల్ ట్వీట్

విగ్నేష్ స్పెషల్ ట్వీట్

ఇక నయనతారను పెళ్లి చేసుకున్న సందర్భంగా దర్శకుడు విగ్నేష్ ఈ విధంగా వివరణ ఇచ్చాడు.. 10 స్కేల్‌లో... ఆమె నయన్.. నేను వన్ అంటూ దేవుని దయతో మా తల్లిదండ్రులు, మంచి స్నేహితుల అన్ని ఆశీర్వాదాలతో పెళ్లి చేసుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక వీరికి సోషల్ మీడియా ద్వారా పలువురు సెలబ్రెటీలు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రిసెప్షన్ వేడుకకు ప్రత్యేకంగా మరికొంతమంది సెలబ్రెటీలను కూడా పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X