హిందీ రీమేక్ లో నయనతార ఖరారు
నయనతార వరసగా సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ చిత్రం పంజాతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు విష్ణు వర్దన్ సినిమా కమిటైంది. అజిత్,ఆర్య కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రం నయనతార కీ రోల్ చేయనుంది. ఆ చిత్రం హిందీ రేస్ కు రీమేక్ కావటం విశేషం. అందులో బిపాసాబసు చేసిన పాత్రలో నయనతార కనపడనుంది. ఇక ఈ చిత్రానికి యవన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఇక హిందీలో రేస్ చిత్రం మంచి విజయం సాధించింది. అక్షయ్ ఖన్నాకు ఈ చిత్రం కమ్ బ్యాక్ ఫిల్మ్ గా మారి హిట్టైంది.
అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీ ఖాన్ ల మధ్య రైవర్లీ నే ఈ చిత్రం కథ. ఇప్పుడా పాత్రలను అజిత్, ఆర్య చేయనుండటంతో మంచి క్రేజ్ వస్తోంది. ఇక గతంలో ఆర్య,నయనతార కాంబినేషన్ లో వచ్చిన బాస్ ఎనగర భాస్కరన్ చిత్రం మంచి విజయం సాధించటం కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. దీనికి తోడు స్టైలిష్ దర్సకుడు గా పేరున్న విష్ణు వర్ధన్ గతంలో అజిత్ తో బిళ్లా టైటిల్ తో సూపర్ హిట్ ఇచ్చారు. మళ్లీ ఆ కాంబినేషన్ కలిసి చెయ్యటం కూడా ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇక ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ కోసం మంచి పోటి ఏర్పడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











