పూర్తి సంతృప్తి పొందడానికే ...నయనతార
పూర్తి సంతృప్తి పొందడానికే ఎలక్ట్రాని అంగీకరించాను. అదొక ఆఫ్ బీట్ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ ఆరంభమై దాదాపు 20 రోజులైంది అంటోంది నయనతార. ఆమె రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...ఒకప్పుడు కథానాయికలు దాదాపు పాతికేళ్లు వెండితెరని ఏలేవారు. ఆ తర్వాత పదిహేనేళ్లు..ఇప్పుడు ఏడు నుంచి పదేళ్లు...హీరోయిన్స్ కెరీర్ స్పాన్ ఉంటూ వస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు నటిగా ప్రతిభ నిరూపించుకోగలిగితేనే భవిష్యత్‌లో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏదో సాధించామనే తృప్తి కలుగుతుంది అంటోంది నయనతార. నటిగా నయనతార కథానాయికగా పరిచయమై ఏడేళ్లు అయ్యింది. ఈ ఏడేళ్లల్లో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి ఆమె 30 చిత్రాలకు పైగానే చేశారు. మరి, బాలీవుడ్‌లో ఎప్పుడు అడుగుపెడతారు? అనే ప్రశ్నను నయనతార ముందుంచినప్పుడు - దక్షిణాది భాషల్లో నేను స్టార్ హీరోయిన్‌ని. ఇక్కడ ఇంత మంచి హోదాని అనుభవిస్తూ బాలీవుడ్‌లో కొత్త తారలా పరిచయం కావడం నాకిష్టం లేదు. ఒకవేళ నేనిక్కడ పాపులర్ అవ్వకముందు హిందీలో అవకాశం వచ్చి ఉంటే అప్పుడు చేసేదాన్ని అంటోంది.


Click it and Unblock the Notifications











