ఆ ఇద్దరు హీరోలతో మనశ్శాంతిని కోల్సోయాను...
'సినిమాల్లోకొచ్చాక బోలడ్డన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను..లెక్కలేనంత డబ్బూ సంపాదించాను.. మనశ్శాంతి కోల్సోయాను.."అంటూ నయనతార ఆవేదన చెందారు. నాకే ఎందుకు ఇలా జరగుతోందో అర్థం కావడంలేదు.." అంటూ ఈ మద్యన ఓ చానెల్ ఇటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మొదట శింబుని ఇష్టపడ్డాను..హ్యాండిచ్చాడు..ఐతే పోన్లే లవ్ ఫెయిల్యూర్..అని గుండె దిటవు చేసుకుందామనుకుంటే, ఎంతగా నన్ను అప్రతిష్టపాల్జేయాలో అంతగా శింబు నా జీవితాన్ని రచ్చకీడ్చాడు" అంటూ నయనతార కన్నీరు మున్నీరయ్యింది. ఇక ప్రభదేవాతో ప్రేమాయణం కూడా తనకు కలిసి రాలేదని చెబుతోన్న నయనతార, ప్రేమ విషయంలో తాను పూర్తిగా ఫెయిలయ్యానని ఒప్పేసుకుంది. మళ్ళీ ఇకపై ప్రేమలో పడ్డం, ఇబ్బందులు కొనితెచ్చుకోవడం చేయననీ, పూర్తిగా కేరీర్ పైనే దృష్టిపెడ్తాననీ, కెరీర్ లోనే ఆనందం వెతుక్కుంటానని నయనతార స్పష్టం చేసింది. మరి ఈ డెసిషన్ కి ఇకనైనా నయనతార కట్టుబడి వుంటుందా?అదే గనుక జరిగితే మొదటి భార్య తో గొడవ పెట్టుకున్న ప్రభుదేవా పరిస్థితి ఏంటి..?


Click it and Unblock the Notifications











