నయనతార నిద్రలేని రాత్రుల కథ

ఈలోగా ఊహించని విధంగా కుశేలన్(కథానాయకుడు),సత్యం(సెల్యూట్) ఫ్లాఫ్ అయ్యాయి. దాంతో సీన్ ఛేంజ్ అయింది కదా...కాస్త తగ్గించుకో నిర్మాతలు ఆమె వెంటబడుతున్నారుట. ముఖ్యంగా పందెంకోడి ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో నటించటానికి ఆమె కోటి పది లక్షలకు ఎగ్రిమెంటు కుదుర్చుకుంది. పాతిక లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంది. అయితే నిర్మాతలు మాత్రం కోటి రూపాయలకే చెయ్యమని అడుగుతున్నారుట. నయనతార మాత్రం కమిట్ అయిన ఎమౌంట్ కి పైసా తగ్గించనని ఖరాఖండిగా చెప్పిందిట.
మరి వేరే ఆల్టర్ నేటివ్ చూసుకోమంటావా అని మధ్యవర్తుల చేత అడిగిస్తే మీ ఇష్టం అడ్వాన్స్ పాతిక లక్షలు వదులుకోదిలిస్తే ఆ పని చేయండి అని రిటార్టు ఇచ్చిందిట. దాంతో కుడితిలో పడ్డ ఎలకలా సినిమా ఎలాగోలా పూర్తి చేధ్దమా అనే ఆలోచనలో వారు పడ్డారుట. అంతే గాక ఈ విషయం బయిట లీకవటంతో మిగతా నిర్మాతలు కూడా ఆ రకంగా రేటు తగ్గిద్దామనే నిర్ణయానికి వచ్చారుట. ఎంతో కష్టపడి వేసుకున్న పునాది ఓ రెండు ఫ్లాపుల దెబ్బకి క్రుంగి పోవటం ఆమెను రాత్రిళ్ళు నిద్రకు దూరం చేస్తోందిట. దాంతో ఉదయం షూటింగ్ లో ఆమె ఎర్రబడ్డ కళ్ళతో దర్శనమిస్తోందిట. దాంతో ఎవరికి వారే రూమర్స్ సృష్టించే పనిలో పడ్డారుట. ఇక ఈ సినిమాలో ఆమె సరసన గజనీ సూర్య తమ్ముడు (పరుత్తి వీరన్ హీరో) చేస్తున్నాడు. ఈ సినిమాపై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications