నయనతార, అనుష్క కాదన్నారు.. టెన్షన్
మొన్నామధ్య బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి జాతీయ అవార్డు సైతం గెలుచుకున్న 'డర్టీ పిక్చర్'చిత్రాన్ని అనూష్క తో రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందులో సిల్క్ స్మిత పాత్ర చేయలేనని అనూష్క తేల్చి చెప్పేసింది. ఆల్రెడీ తెలుగులో కూడా రిలీజైన సినిమాని మళ్ళీ రీమేక్ చేయటమెందుకు అన్న ధోరణిలో ఆమె మాట్లాడి నో చెప్పిందని సమాచారం. దాంతో రీసెంట్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టిన నయనతార ముందుకు సిల్క్ పాత్రను తీసుకువెళ్లారు. ఆమె కూడా సుముఖంగా లేరని చెన్నై వర్గాల సమాచారం. దాంతో దక్షిణాదిన ఈ సిల్క్ పాత్రను ఎవరు చేస్తారు...ఎవరు చేస్తే ప్రాజెక్టుకు ప్లస్ అవుతుందనే విషయంలో దర్సక,నిర్మాతలు తలపట్టుకు కూర్చున్నట్లు సమాచారం.
సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ చేయాలని ఏక్తా కపూర్ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదించి విడుదల చేశారు. కానీ ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తమ పిక్చర్ డర్టీగా ఉంటుందని టైటిల్‌లో చెప్పి మరీ ఏక్తాకపూర్ నిర్భయంగా విడుదల చేసిన చిత్రం 'డర్టీ పిక్చర్'లో చేయటానికి ఇప్పుడు ఎవరూ ఆసక్తి చూపటం లేదు.
ఇక అప్పటివరకు హోమ్లీగా కనిపించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో హద్దులు దాటి నటించినా ఆ పాత్రకు ప్రజలు నీరాజనం పెట్టారు...అవార్డులు వరించాయి. అనూష్క ని అడగటానికి కారణం వేదం చిత్రంలో సరోజ పాత్ర అని చెప్తున్నారు. అందులోనూ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న వాళ్ళ చేతే చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. మంచి ఓపినింగ్స్ రాబట్టాలంటే ఆ విధమైన స్ట్రాటజీ అవసరమే అంటున్నారు. విద్యాబాలన్ కాకుండా ఎవరో పెద్దగా తెలియని చిన్న ఆర్టిస్టు చేత డర్టీ పిక్చర్ చేయించి ఉంటే ఆ సినిమా చూడటానికి ఎవరికీ ఆసక్తి ఉండేది కాదనే వాస్తవం వివరిస్తున్నారు.
మరో ప్రక్క మరోసారి నయనతార,అనూష్క ఇద్దరూ ఇప్పుడు గుణశేఖర్ తాజా చిత్రం 'రుద్రమదేవి'హీరోయిన్ రేసులో ఉన్నారు. జేజమ్మగా అరుంధతిలో అదరకొట్టిన అనూష్క అయితే బావుంటుందని కొందరు కాదు..సీతమ్మ తల్లిగా శ్రీరామ రాజ్యంలో నిలిచిపోయిన నయనతార అయితే బెస్ట్ అని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. అయితే గుణశేఖర్ ఇద్దరికీ స్క్ర్రిప్టు చెప్పాడని,అయితే ఇద్దరిలో ఎవరూ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. గుణశే్ఖర్ వరస ప్లాపుల్లో ఉండటంతో ఏ హీరోయిన్ కూడా ఆయన సినిమాలో చేయటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అందులోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే హీరోల సినిమాలకు దూరమవ్వటమే అని భావిస్తున్నారు. ఇక గుణశేఖర్ 'రుద్రమదేవి' పాత్ర కోసం ఇద్దరు సౌత్ లో ఇద్దరు పెద్ద హీరోయిన్స్ ని సంప్రదించారని చెప్పారు.


Click it and Unblock the Notifications











