నయనతార సిటీ బస్సు ప్రయాణం..హడావిడి
తాజాగా నయనతార చెన్నై లోని కుంభకోణం బస్టాండ్ లో సిటీ బస్సు ఎక్కి వేళ్ళాడి ప్రయాణం చేసింది. ఆమెతో పాటు హీరో ఆర్య కూడా ఉన్నారు. దాంతో హఠాత్తుగా ఆమెను అక్కడ చూసిన వారంతా షాకయ్యారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు అతి కష్టం మీద గుంపుని చెదరకొట్టి సరి చేసారు. ఇక నయనతారని ఇసా షూటింగ్ నిమిత్తం రోడ్డు మీదకు తెచ్చి సిటీ బస్ ఎక్కించిన ఘనత రాజేష్ అనే దర్శకుడుదే. ఆయన ఆర్య,నయనతార కాంబినేషన్లో చిత్రీకరిస్తున్న 'శివ మనసుల శక్తి' చిత్రం షూటింగ్ ని ఇలా లైవ్ గా ఉండాలని ప్లాన్ చేసారు. ఇదేంటి అంటే తప్పదు...కథపరంగా కొన్ని దృశ్యాలు వాస్తవిక వాతావరణంలో అవరసం అంటున్నారాయన. ఇక నయనతార ప్రజల మధ్యకొస్తే షూటింగ్ చేయడం అంత సులభం కాదని మరో సారి రుజువు అయిందని అంటున్నారు. ఇంతకు ముందు కూడా నయనతార చిత్రం కోసం ఇలాంటి హడావిడి చోటు చేసుకుంది. ఒక అరగంట చిత్రీకరణ సాగగానే వరదలా వచ్చిన జనం తాకిడికి తట్టుకోలేక యూనిట్ మొత్తం అక్కడి నుంచి తరలి వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











