నయనతారపై నిషేధం ఎత్తివేత

సుభాష్ చంద్రబోస్ అనే నిర్మాత ఒక సినిమా తీయడానికి నిశ్చయించి నయనతారకు రూ.15 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వలన నిర్మాత చిత్ర నిర్మాణాన్ని విరమించుకున్నట్లు చెప్పి అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటే నయనతార ఇవ్వనని చెప్పింది. దీనితో సదరు నిర్మాత నిర్మాతల మండలిని ఆశ్రయించగా వారు నయనతారపై నిషేధం విధించారు.
'పయ్యా' చిత్రానికి సంబంధించిన వివాదంలో తమిళ ఫిల్‌మ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు సౌత్ ఇండియా ఫిల్‌మయాక్టర్‌స అసోసియేషన్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
పరుత్తువీరన్' కార్తీ హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో రూపొందించ తలపెట్టిన పయ్యా' చిత్రంలో హీరోయిన్‌గా మొదట నయనతారను తీసుకున్నారు. కోటి రూపాయల పారితోషికం చెల్లించేందుకు అంగీకరించి, ఆమెకు కొంత అడ్వాన్‌స సైతం చెల్లించారు. అయితే, ఆ తర్వాత ఆర్థికమాంద్యం తలెత్తడంతో, పారితోషికం తగ్గించుకోవాల్సిందిగా దర్శక, నిర్మాతలు నయనతారను కోరారు. అందుకు ఆమె సమ్మతించలేదు. అయితే తామిచ్చిన అడ్వాన్‌సను వెనక్కి ఇచ్చేయవలసిందిగా నిర్మాత చేసిన విజ్ఞప్తిని ఈ భామ పెడచెవిని పెట్టింది.
నయనతార స్థానంలో తమన్నాను తీసుకుని షూటింగ్ మొదలుపెట్టిన పయ్యా' దర్శక, నిర్మాతలు ఈ విషయమై తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. తీసుకున్న అడ్వాన్సు వాపసు ఇచ్చేయమని నిర్మాత మండలి నయనతారకు సూచించింది. అయితే దానిని కూడా ఈ ముద్దుగుమ్మ ఖాతరు చేయకపోవడంతో...ఈ నిషేధం అనివార్యమైంది.
ఈ మేరకు తెలుగు, మలయాళ నిర్మాతలసంఘాలకు తమిళ నిర్మాతల సంఘం లేఖలు వ్రాసిందని తెలుస్తోంది.నయనతార ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే!


Click it and Unblock the Notifications











