నయనతార అందానికి కారణం ఆయల్ మార్చటం?
నయనతార అందానికి దాసోహమనని కుర్రకారు అరుదు. అంతలా ఆమె తన అభిమానులను వెండితెరకు కట్టివేయటానికి కారణం ఓ ప్రత్యేకమైన ఆయిల్ మేకప్ అని తెలుస్తోంది. అయితే ఆ ఆయల్ ని మారుస్తూ మేకప్ ని సరిచేసుకోవాలట. కాస్త ఒంటికి జిడ్డుగా ఉన్న ఫీలింగ్ అన్పించినా తెరమీద దాని ఎఫెక్టు అధ్బుతంట. అందుకే నయనతార మిగతా హీరోయిన్స్ కన్నా మెరుగ్గా కనపడుతుందిట. అయితే హీరోలు ఈ రకమైన మేకప్ తో ఉండటాన్ని వద్దని చెప్పుతారు. నటనలో భాగంగా ఆమెను ముట్టుకున్నప్పుడు జిగురుగా తగులుతుందని వారు ఏక్సెప్ట్ చేయరు. దాంతో మిగతా హీరోయిన్స్ ఈ తరహా మేకప్ పై ఆసక్తి చూపరు. అయితే నయనతార సినిమా ఒప్పుకునేటప్పుడే ఖచ్చితంగా చెప్పుతుంది తను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆయిల్ మేకప్ లో ఉంటానని. అందులో ఆమె డిమాండ్ ఉన్న హీరోయిన్ కావటంతో ఆమె ఎలా అంటే అలా సాగుతోంది. దాంతో తనకు నచ్చిన విధంగానే హీరోలను డామినేట్ చేస్తూ తెరపై అందాల ప్రదర్శన చేస్తోంది. ప్రస్తుతం నయనతార ..ఎన్టీఆర్ సరసన అదుర్స్ చిత్రంలో చేస్తోంది. షీలా మరో పాత్రలో కనపించే ఆ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రలలో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











