నయనతార బ్యూటీ స్పాట్ కనపడలేదా...!
ఒక్కొక్కళ్ళకి ఒక్కో చోట బ్యూటీ స్పాట్స్ ఉంటుంటాయి. జయప్రదకు పైపెదవి పైన వుండే పుట్టుమచ్చ ఎంతో అందాన్నిస్తుంది. అలాగే మల్లూ బేబీ నయనతారకు కూడా ఇచుమించు అదే ప్రదేశంలో... అంటే పైపెదవి పైన ఓ పుట్టుమచ్చ వుంటుంది. నయన్ సెక్సప్పీల్ కూడా అక్కడే ఉందంటారు చాలామంది. అయితే, ఇప్పుడీ పుట్టుమచ్చ 'శ్రీరామరాజ్యం' సినిమాలో కనపడకపోవచ్చని తెలుస్తోంది.
సీతాదేవిది పురాణ పాత్ర కాబట్టి, ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటున్న దర్శకుడు బాపూ ఆమె మచ్చను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారట. కంప్యుటర్ గ్రాఫిక్స్ సహకారంతో పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో దానిని ఎరెజ్ చేస్తున్నారని అంటున్నారు. సెప్టెంబర్లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంచితే, బాపూ చిత్రకళా నైపుణ్యం గురించి తెలుసుకున్న నయనతార, ఈ సినిమా షూటింగ్ సమయంలో... బాపూని ఆయన గీసిన ఆర్ట్ ఒకటి బహుమతిగా అడిగిందట. దాంతో, శ్రీరాముడి స్వయంవరం నుంచి పట్టాభిషేకం వరకు సాగే ఘట్టాన్ని వివరిస్తూ, రసరమ్యంగా గీసిన ఓ స్కెచ్ ని నయన్ కి బాపూ బహూకరించారట!


Click it and Unblock the Notifications











