బ్యాంకాక్ మ్యాటర్ పై నయనతార ఖండన
ఇరవై లక్షల రూపాయలు పట్టుకుని..నాలుగు రోజుల క్రితం నయనతార బ్యాంకాక్ వెళ్లింది. తన మేనేజర్ రాజేష్‌తో కలిసి వెళ్లిన ఆమె సెక్యూరటీ చెక్ లో దొరికిపోయింది అనే వార్త అంతటా ప్రచారమవుతోంది. బ్యాంకాక్ ట్రిప్ ముగించుకుని ఈ ఇద్దరూ చెన్నయ్ చేరుకున్నారని, చెన్నయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దర్నీ విడివిడిగా 40 నిమిషాలపాటు అధికారులు విచారించారని కూడా అన్ని ఇంగ్లీష్ డైలీలలో వార్తలు వచ్చాయు. ఈ నేపధ్యంలో నయనతార ఈ విషయమై నోరు విప్పి క్లారిఫై చేసేందుకు ప్రయత్నం చేసింది.
ఆమె మాటల్లో...''ఎయిర్‌పోర్ట్‌లో 'సెక్యుర్టీ చెక్' అనేది చాలా కామన్‌గా జరుగుతుంది. ఈ విషయాన్ని భూతద్దంలో ఎందుకు చూస్తున్నారో నాకర్థం కావడంలేదు. నాకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ సెక్యుర్టీ చెక్ ఉంటుంది. అలాగే విమానంలో ప్రయాణించేవారిని భారీ క్యాష్ తీసుకెళ్లడానికి అనుమతించరు. అలాంటప్పుడు నేను 20 లక్షలు ఎలా తీసుకువెళతాను? ఒక చిన్న విషయాన్ని చిలవలు పలవలు చేయడం బాగాలేదు'' అంది.
అలాగే...ఆమె అజిత్ చేస్తున్న కొత్త చిత్రం షూటింగ్ కోసం అక్కడికి వెళ్లానంటున్నా చాలా మంది..మాజీ ప్రియుడు ప్రభుదేవా పేరుతో చేతి మీద ఉన్న టాటూని తీయించుకోవడానికే ఈ కేరళ కుట్టి బ్యాంకాక్ వెళ్లారన్నది అంటున్నారు. ఈ విషయం పై నయనతార మండిపడుతూ..'ఇంత చిన్న టాటూ తీయించుకోవడానికి బ్యాంకాక్ వరకు వెళ్లాలా? అంతదూరం వెళ్లకుండా ఆ పనేదో ఇక్కడే కానిచ్చుకునేదాన్ని. బ్యాంకాక్‌లో నేను టాటూ తీయించలేదు. కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి. టాటూ అలానే ఉంది' అని సవాల్ విసిరింది.
ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.


Click it and Unblock the Notifications











