ప్రభుదేవా వల్లే నా జీవితం నాశంనమైంది: నయనతార
ప్రభుదేవా, నయనతార ప్రేమ కథ మరో మలుపు తిరగనుంది. ఇద్దరు బిడ్డల తండ్రైన ప్రభుదేవా..హీరోయిన్ నయనతారను పెళ్లాడనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన నాటి నుంచి ఆయన భార్య రామలత్ త్రీవంగా ఆవేదన చెందుతోంది. కాగా ఇటీవలే నయనతార ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని బాధను వెళ్ళగక్కింది..
ప్రభుదేవాతో తన ప్రేమ, పెళ్లి అన్ని సాఫీగా సాగిపోతాయనుకుంటే ఆ వ్యవహారం కాస్తా వివాదస్పదమైపోయిందని, ఇందతా ప్రభు వల్లే జరిగిందని అంటూ ప్లేట్ ఫిరాయించేసి ప్రభుదేవాపై కామెంట్స్ చేయడం అందరి దృష్టిని ఆకరిస్తోంది. ఇన్నాళ్లు ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించి ఇప్పుడేమో ఆయనతో లవ్ ఎఫైర్ కారణంగానే కెరీర్ ను నష్టపోయానంటూ తన అక్కసు వెళ్లగక్కుతోంది. ప్రస్తుతం నయనతార నందమూరి బాలకృష్ణ బాపు దర్శకత్వంలో నటిస్తున్న 'శ్రీరామరాజ్యం" చిత్రంలో సీతగా నటిస్తోంది.
More from Filmibeat
నయనతార ప్రభుదేవా బాలకృష్ణ బాపు శ్రీరామరాజ్యం సింహా nayantara prabhu deva balakrishna bapu sri rama rajyam simha


Click it and Unblock the Notifications











