నాకు చాలాసార్లు పెళ్లి చేసారు...నయనతార
ఇప్పటికే మీడియా నాకు చాలాసార్లు పెళ్లి చేసింది. ఈ వార్తలు విని నేను కంగారు పడలేదు. మాట్లాడేవాళ్లు మాట్లాడుకుంటారు. అవన్నీ పట్టించుకుంటే నా పని నేను సరిగ్గా చేయలేను. అందుకే వదంతులకు రియాక్ట్ కావడంలేదు. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటోంది నయనతార. నయనతార నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేసి ప్రభుదేవాని పెళ్ళాడబోతోందనే వార్త ఇటీవల మీడియాలో వచ్చి చర్చగా మారింది. ఆ విషయంపై స్పందించింది. అలాగే..."నేను నటనకు దూరం కాబోతున్నాననే వార్త నిజం కాదు.త్వరలో రెండు తెలుగు సినిమాలకు ఓ తమిళ సినిమాకు సైన్ చేయబోతున్నాను. ప్రస్తుతం ఈ చిత్రాలకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ చిత్రాల గురించి ప్రకటిస్తా. నా గురించి ఏదో ఒక వార్త ప్రచారం చేయడం కామన్ అయ్యింది అందామె. ప్రస్తుతం ఆమె తమిళంలో 'బాస్ ఎన్‌గిర భాస్కరన్' చిత్రంలో నటిస్తున్నారు. కన్నడంలో ఉపేంద్ర సరసన ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో 'ఎలక్ట్రా', 'మతిలుకల్కాపురం' అనే చిత్రాల్లో కూడా యాక్ట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











