నయనతారను బలవంతం చేసారంటూ..
నయనతార మరోసారి హాట్ టాపిక్ గా మారింది.ఆమె ప్రభుదేవాతో వివాహం నిమిత్తం క్రైస్తవమతం నుంచి హిందూమతంలో కి మారింది.అయితే ఆ మతమార్పిడిని, నయనతార వైఖరిని ఓ క్రైస్తవ సంఘం తీవ్రంగా ఖండించింది. ఆమెను బలవంతంగా మతమార్పిడి చేయించారని, ఇందుకు ప్రభుదేవా కారకుడని ఆరోపించింది. ఆరాధన క్రైస్తవ సంఘం ప్రతినిధి ఇనియన్‌జాన్ మంగళవారం స్పందిస్తూ.. ప్రభుదేవా వివాహం చేసుకోవడం కోసం నయనతారను మతమార్పిడి చేయించిన విషయం ఆవేదనను కలుగజేస్తోంది. ప్రభుదేవా బలవంతపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడేలా చేశారు. దీన్ని కూడా ఓ నేరంగా పరిగణించాలి అని పేర్కొన్నారు.
సోమవారం చెన్నయ్‌లోని అర్యసమాజ్‌లో నయనతార మతం మార్చుకుంది. చెన్నయ్ ఆర్యసమాజ్‌లో హిందుత్వం స్వీకరించింది. నయన తార శుద్ధికర్మతో క్రిస్టియన్ మతం నుంచి హిందువుగా మారింది. ప్రభుదేవాతో పెళ్లి కోసమే ఆమె మతం మార్చుకున్నట్లు తెలిపింది. ఇక ప్రభుదేవా,నయనతార వివాహం త్వరలో ముంబైలో జరగనుందని సమాచారం.ఈ మేరకు వాళ్ళు పెళ్ళి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.భార్యతో లీగల్ గా విడిపోయిన ప్రభుదేవా త్వరలోనే నయనతార మెళ్ళో తాళి కట్టనున్నాడు.ఈ వివాహం కోసం నయనతార కూడా సినిమాలు ఏమీ కమిట్ కాకుండా ఖాళీ చేసుకుంది.ప్రభుదేవా కూడా తాను డైరక్ట్ చేస్తున్న సినిమాలను త్వరతిగతిన పూర్తి చేసి ఈ వివాహానికి రెడీ కావాలని ఆకాంక్షిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











