నయనతార, త్రిషల వార్

దాంతో ఛాన్స్ మిస్సయిన నయనతార కోపంతో మండిపడుతోంది. త్రిష విషయం ఎత్తకుండా సూపర్ కింగ్స్ యాజమాన్యం పద్దతి మరీ అన్‌ప్రొఫెషనల్‌గా వుందని ....బ్రాండ్ అంబాసడర్ పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు ఎలాంటి లేఖగానీ, అధికారిక సమాచారం గానీ తనకు అందచేయలేదని ఆమె సీరియస్ అవుతోంది. కాస్త కబురు ముందు అందితే ఆ మ్యాచ్‌కు తప్పకుండా హాజరయ్యేదాన్నని ఆమె అంటోంది. పైగా ఆ సమయంలో హైదరాబాద్‌లో కుచేలన్ షూటింగులో వున్న తనకు వడదెబ్బ తగిలి విశ్రాంతి తీసుకుంటూ వున్నానని కూడా చెబుతోంది. కాని సూపర్ కింగ్స్ యాజమాన్యం వారు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. కమిట్ మెంట్ లేకుండా నయనతార బిహేవ్ చేసిందని ఆరోపిస్తున్నారు. అంతే గాక కుచేలన్ షూటింగ్ లో వడదెబ్బ విషయం వాళ్ళు ఎంక్వైరీ చేసారట. ఆమె కొద్ది గంటలే ఆసుపత్రిలో ఉందని సీరియస్ యేమి కాదని తేలిందిట.అలాగే తేరుకున్న తర్వాత భాద్యతగా మ్యాచ్ కి అటెండు కావటంలేదనే విషయం తెలియబరచలేదని అంటున్నారు. అంతేగాక విజయ్ ఒక్కరినే బ్రాండు అంబాసిడర్ గా గుర్తిస్తామని అంటున్నారు. వారు త్రిష విషయమే ఎత్తటమేలేదు. కాని నయనతార మాత్రం ఇవేమి గుర్తించకుండా తన తోటి ఉన్నవాళ్ళే తనను ముంచుతున్నారంటూ త్రిషను ఆడిపోసుకుంది.


Click it and Unblock the Notifications











