నయనతార డిమాండ్ తగ్గిందని,ఆమె సినిమాలు వరస ఫ్లాఫ్ అవటంతో నిర్మాతలు ఆమెతో చేయటానికి జంకుతున్నారని ఓ ప్రక్క వార్తలు వస్తున్న సంగతి విసిదమే. అయితే ఆమె డిమాండ్ ఏమీ తగ్గలేదని ఓ తాజా సంఘటన ప్రూవ్ చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. ఈ మధ్య ఆమె ముఫ్ఫై నిముషాలు చిన్న పనికి పదిలక్షలు వసూలు చేసిందని చెప్తున్నారు. ఇంతకీ ఏమిటా పని అంటే త్రివేండ్రమ్ లోని ఓ షాపు ఓపినింగ్ కి వెళ్ళి దీపారాధన చేయటం. ఆ తర్వాత అక్కడున్న పెద్దలుతో ఫొటోలు దిగంటం. మొత్తం అంతా కలిపి అరగంటకి మించి గడపలేదుట. ఆ షాపు ఓపినింగ్ పంక్షన్ కి ఓ లోకల్ పొలిటీషియన్ వస్తున్నాడని ఒక్క పదినిముషాలు ఆగమన్నారు. అయితే ఆమె వచ్చిన పని అయిపోయింది ...సారి అని వెళ్ళిపోయింది. దాంతో పది లక్షలు వసూలు చేసింది పది నిముషాలు ఆగలేకపోయిందని వాపోయారు.