నయనతార ఏడుపు అందుకే...
మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు నా ఏడుపు అన్నట్లు తయారైంది నయనతార పరిస్ధితి అంటున్నారు. ఆమె తల్లితండ్రులు ఆమెకు ఆంక్షలు విధించటం కన్నా మీడియాలో ఈ వార్తలు రావటం ఆమెకు బాధ కలిగిస్తోందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయంపై ఆమె ఘాటుగానే స్పందిస్తోంది. నాపై మా ఇంట్లో వాళ్ళకు నమ్మకం ఎక్కువ. నన్ను కాపలా కాసే అవసరం వాళ్ళకెందుకు? అంటూ ప్రశ్నిస్తోంది నయనతార.
నయతార, ప్రభుదేవా ప్రేమ వ్యవహారం పై సీరియస్ అయిన నయనతార తల్లి తండ్రులు ఆమెకు కాపలాగా ఆమె అన్నను షూటింగ్ లకు పంపుతున్న సంగతి తెలిసిందే. అలాగే పరిస్ధితిని బట్టి ఆమె వెంటే వారు కూడా వెళ్తున్నారనీ, షూటింగ్ దగ్గర కూడా కూర్చొంటున్నారనీ తెలిసింది. అంతవరకూ బాగానే ఉన్నా ఈ విషయం మీడియాలో రావటంతో ఆమె సీరియస్ అయ్యింది.
హీరోయిన్స్ తల్లితండ్రులు సెట్లో ఉండటం సాధారణ విషయమే. కానీ మా వాళ్ళు అలా కాదు. నన్ను నమ్మి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఒక వేళ నేను ఎవరికైనా సమాధానం చెప్పవలసొస్తే అది వాళ్ళకు మాత్రమే అని చెప్పింది..అంతేగాక పనిలో పనిగా మీడియా పైనా విరుచుకుపడింది. నాపై రాసే ముందు ఒక్క క్షణం నిజం ఏమిటో తెలుసుకుంటే మంచిది. ఇలా లేనిపోని కబుర్లు రాసేయడం ఎందుకు? అంటోంది. ఇదంతా కరెక్టే గానీ ఇన్నాళ్ళు స్వేఛ్చగా తిరిగిన ఆమెను ఇలా కట్టుదిట్టం చేస్తే ఇబ్బందే కదా అందుకే ఆమె మండిపాటు అని సాటివారు అంటున్నారు.


Click it and Unblock the Notifications











