మహాత్మా గాంధీ ని ఫాలో అవుతున్న నయనతార
నయనతార తాజాగా మహాత్ముడు చూపిన బాటలో నడుస్తోందని తమిళ పరిశ్రమలో వినపడుతోంది. ఇంతకీ గాంధీజీ సిద్దాంతాలలో ఏది ఆమె పాటిస్తోంది అంటే...ఏదైనా మొదట తాను ఆచరించే ఇతరులకు చెప్పాలనే సందేశం. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.."ఓ మంచి మాట, ఓ మంచి పని చేసేందుకు ఉపన్యాసాలూ, సందేశాలు అవసరం లేదు. ముందు మనం ఆచరించి చూపిస్తే మంచిదనుకొంటాను. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా నాకు నచ్చిన పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాను. అది చేయండి..ఇలా చేయండి అంటూ మనం పాటించకపోతే బాగోదు. ముందే నేను పాటించి తరవాత చెబుతాను" అంటోంది. పర్యావరణ పరిరక్షణ కోసం నయనతార ఈ మధ్య ప్రచారం మొదలుపెట్టింది. ఆమె షాపింగ్‌కి వెళ్తే కాగితపు సంచుల్నే చేతులో ఉంచుకొంటుందని చెన్నై జనాలు చెబుతున్నారు. ఎవరన్నా అడిగితే 'అంతా పర్యావరణ పరిరక్షణ కోసమే' అని చెప్తోంది. ఇక నయనతార ప్రస్తుతం బాలకృష్ణ సరసన సింహాలో చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











