భర్త..ఆ ఊహే ఎంతో తియ్యగా ఉంది: నయనతార
పదేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని భర్త, పిల్లలతో ఆనందంగా ఉంటానని అనుకుంటున్నాను. ఆ ఊహే ఎంతో తియ్యగా ఉంది.ఎందుకంటే అప్పుడు నేను హాయిగా ఇంటిపట్టున ఉంటానని ఊహించుకుంటున్నాను అంటోంది నయనతార. ఆమె భవిష్యత్ గురించి ఎలా ఊహిస్తోందో చెబుతూ ఇలా కామెంట్ చేసింది. అలాగే గతం గురించి భవిష్యత్ గురించి అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. గతాన్ని తల్చుకున్నప్పుడు గమ్మత్తుగానూ భవిష్యత్‌ని ఊహించినప్పుడు జీవితం కమ్మగానూ అనిపిస్తుంది నాకు అంది. ఇక నయనతార ప్రస్తుతం ఓ కన్నడ చిత్రం, మలయాళంలో 'ఎలక్ట్రా' చిత్రంలో టైటిల్ రోల్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ఎలక్ట్రాలాంటి పూర్తి నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఎప్పుడో గానీ రావు కాబట్టి ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని ఈ బ్యూటీ శెలవిస్తోంది.
ఇక ఈ చిత్రంలో నయనతార తల్లిదండ్రులుగా మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. నయనతార టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. నయనతార, ఆర్య జంటగా తమిళంలో 'బాస్ ఎన్‌గిర భాస్కరన్' అనే చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డ్ గ్రహీత శ్యాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార మేకప్ లేకుండా నటిస్తోంది.ఈ పాత్ర గురించి చెబుతూ - "ఎలక్ట్రా కోసం నన్ను నేను పూర్తిగా మార్చేసుకున్నా. ఇప్పటివరకు నేను నటించినవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. పెద్ద సినిమాల్లో నటించినప్పుడు పారితోషికం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ చిన్న బడ్జెట్ చిత్రాల్లో చేసినప్పుడు నటనకు స్కోప్ ఉంటుంది. వరుసగా ఇలాంటి సినిమాలే కాకపోయినా అడపా దడపా ఇలాంటివి చేయడంవల్ల ప్రతిభ వెలికి వస్తుంది. ఆ కారణంతోనే 'ఎలక్ట్రా' సినిమాని అంగీకరించాను. నటిగా నా సత్తా నిరూపించే చిత్రం ఇది' అంటోంది నయనతార.


Click it and Unblock the Notifications











