పక్కా ప్రొపిషనల్ గా ప్రవర్తిస్తున్న నయనతార
నయనతార అంతటి ప్రొఫిషనల్ ని నేను ఇప్పటివరకూ చూడలేదు. షెడ్యూల్ డైమ్ కి పూర్తి మేకప్ తో సెట్ కి వచ్చేస్తోంది. ఆమె స్పీడు, పనిపట్ల ఉన్న డెడికేషన్ చూసి మేము నేర్చుకుంటున్నాం అంటున్నారు తమిళ దర్శకుడు రాజేష్. ఆయన రూపొందిస్తున్న బాస్ ఎంగిర భాస్కరన్ చిత్రంలో నయనతార...ఆర్య సరసన చేస్తోంది. వీళ్ళిద్దరూ ఓ వెడ్డింగ్ రిసిప్షన్ లో కలసి, పాడుగునే సాంగ్ ఒకటి రీసెంట్ గా చిత్రీకరించారు. నయనతార ఈ పాటలో స్పీడ్ గా చేసిన డాన్స్ మూవ్ మెంట్స్..ఆర్య అందుకులేకపోయారు. తాను ఇప్పుడు పూర్తిగా కెరీర్ మీదే దృష్టిపెట్టానని, కేవలం గ్లామర్ రోల్సే కాకుండా నటనకు అవకాశమున్నవి కూడా చేస్తానని ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నయనతార చెప్పుకొచ్చింది. ఇక నయనతార, బాలకృష్ణ కాంబినేషన్లో రెడీ అయిన సింహా చిత్రం ఈ నెలాఖరున రిలీజ్ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని సమాచారం. ఓ జమిందారిణి గెటప్ లో ఆమె కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications











