ప్రభుదేవాతో ఫిక్స్ అయిపోయివరసపెట్టికొట్టిన నయనతార....
నయనతార నటించిన 'ఎంగీరన్ భాస్కరన్" అనే తమిళ సినిమా హిట్టయ్యిందని సమాచారం. ఈ సినిమా తెలుగులో 'నేనే అంబాని (ఆరు నెలల్లో)" అనే పేరుతో అనువాదమవుతోంది. ప్రభుదేవాతో ఎఫైర్ పెట్టుకుని సౌందర్యపోషణపై శ్రద్ద తగ్గించుకుని క్రమంగా అందాలు కోల్పోయిన నయనతార.. మెల్లగా సినిమాలు సైతం తగ్గించుకుంటూ వస్తోంది. అయితే..ప్రభుదేవాతో సెటిలైపోయి ఇక సినిమాలు విరమించుకుందాం అని నిర్ణయం తీసుకున్నాక, ఆమెకు హిట్లు మీద హిట్లు వస్తున్నాయి. గ్లామర్ పూర్తిగా క్షీణించాక, నయన నటించిన 'ఆదవన్" మంచి హిట్టయ్యింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో 'ఘటికుడు" పేరుతో విడుదలైంది. అలాగే నయనతార నటించిన మలయాళ సినిమా 'బాడీగార్డ్" కూడా నయనతార డీగ్లామరస్ గా తయారయ్యాకే విడుదలై విజయం సాధించింది. ఇక తెలుగులో నయనతార హీరోయిన్ గా నటించిన 'అదుర్స్, సింహా" సినిమాలు కూడా హిట్ కొట్టిన విషయం మీకు తెలిసిందే. అయితే ప్రభుతో పెళ్ళి చేసుకుని సెటిలైపోతుందో లేక మరిన్ని హిట్లు కొడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











