క్లైమాక్స్ లో నయనతార కేక పెట్టిస్తుంది!?

By Srikanya

శివాజీ చిత్రంలో ఐటంసాంగ్,'కథానాయకుడు' చిత్రంలో ప్రత్యేక పాత్ర నయనతార చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతిథి పాత్ర గానీ, ఐటమ్‌ సాంగ్‌ గానీ ఏమీ ఒప్పుకోలేదు. అయితే ఆమె తాజాగా 'గోవా'అనే చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో అందరికీ షాక్ కొట్టినంత పనయింది. సరోజ ఫేమ్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య నిర్మిస్తున్నారు.

జై, వైభవ్‌, ప్రేమ్‌జీ, స్నేహ తదితరులు మొయిన్ క్యారెక్టర్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథలో తన పాత్రకి ఉన్న ప్రాధాన్యతని తెలుసుకుని నయనతార అంగీకరించిందని సమాచారం. ఇటీవలే నయనతార, జై, వైభవ్‌, ప్రేమ్‌జీ కాంబినేషన్‌ లో చెన్నయ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 'గోవా' చిత్రం క్లైమాక్స్ల్ నయనతార కనిపిస్తారట.అలాగే ఆ సన్నివేశాలే సినిమాకు ప్రాణం అని తెలుస్తోంది. ఆ సీన్ తెరపై చూస్తే కేక పెట్టే రేంజిలో ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్తున్నారు.

ఇక ఈ పాత్ర చేయడానికి నయనతార పైసా కూడా పారితోషికం తీసుకోలేదు. దానికి కారణం ఆమె ఈ డైరక్టర్ వెంకట్‌ ప్రభుకి అభిమాని అట. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందించారు. మొత్తం తొమ్మిది పాటలు ఉంటాయి. అయితే అవి ఆడియో సీడీకే పరిమితమవుతాయి. సినిమాలో మాత్రం నాలుగ పాటలు మాత్రమే ఉంటాయి. డిసెంబర్‌లో ఈ ఆడియో వేడుకను భారీ ఎత్తున జరపడానికి సౌందర్య రజనీకాంత్‌ సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి 'గోవా'ని విడుదల చేయాలనుకుంటున్నారు.తెలుగులోనూ డబ్బింగ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X