నయనతారతో చేయటం లేదు అనూష్కతోనే..ప్రభుదేవా
పోకిరి రీమేక్ వాంటెడ్ సినిమాతో బాలీవుడ్ హిట్ ఇచ్చిన ప్రభుదేవా మోస్ట్ వాంటెడ్ పేరుతో సీక్వెల్ తీస్తున్నారంటూ వినపడుతోంది. అంతేగాక అందులో నయనతారను తీసుకుని ఆమెకు బాలీవుడ్ ఎంట్రి ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేఫద్యంలో ఈ ఊహాగానాలకు ప్రభుదేవా తెరదించుతూ సమాధానాలు ఇచ్చారు. మీరు అన్నట్లుగా వాంటెడ్ పెద్ద హిట్టే అయితే సీక్వెల్ చేయటం మీరనుకున్నంత ఈజీ కాదు.ఇంత అర్జెంటుగా స్క్రిప్టు ఎక్కడ నుంచి తేను.అలాగే సల్మాన్ మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కాబట్టి బాలీవుడ్ లో ఇంకో సినిమా చేయటానికి చాలా టైమ్ పడుతుంది.
ఇక నయనతార మ్యాటర్ కొస్తే..ఆమెకు నేను బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదు. నా తర్వాత సినిమాలో హీరోయిన్ గా అనూష్కను అనుకుంటున్నాం. అది కూడా కన్ఫర్మ్ కాలేదు. అది ఓ తమిళ సినిమా. జయం రవి హీరోగా ఉంటాడు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. నేను కూడా స్వయంగా ఓ వెర్షన్ రాస్తున్నాను. హరీష్ జయిరాజ్ ని సంగీతానికి తీసుకున్నాను. ఈ సబ్జెక్టు అనుకోగానే ముందుగా అతనే గుర్తు వచ్చారు. అంతగా సంగీత ప్రాధాన్యత ఉన్న చిత్రం ఇది.మ్యూజికల్ రొమాంటిక్ స్టోరీ ఇది..ఇప్పటికీ ఈ వివరాలు. సినిమా ప్రారంభం అయ్యాక మిగతావి అంటూ ముగించారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











