twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార మెచ్చుకుందని మురిసిపోతోంది

    By Srikanya
    |

    నీ ఫోటో షూట్ చూసాను.అందులో ఒక ఫోటోలో అచ్చం ప్రియాంక చోప్రాలా ఉన్నావు. ఇంత త్వరగా ఆఫర్స్ పొందుతూ ముందుకు వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది అంటూ నయనతార రీసెంట్ గా అమలా పౌల్ కి ఎస్ ఎమ్ ఎస్ చేసింది. ఈ విషయాన్ని మీడియాకు తెలియచేస్తూ చాలా మురిసిపోయింది అమలా పౌల్. వెంటనే తాను కూడా నయనా నువ్వు నన్ను చాలా ఆనందపరచావు. ఈ విషయం చెప్పి చాలా ఆనంద పరిచావు. ఏ ఇతర హీరోయిన్ కూడా ఇలా నన్ను మెచ్చుకోలేదు అని రిప్లై ఇచ్చింది. ఇక ప్రస్తుతం అమలా పౌల్ ...నాగచైతన్య సరసన బెజవాడ చిత్రంలో చేస్తోంది. అలాగే తెలుగులో మరిన్ని పెద్ద సంస్ధలు వాళ్ళు ఆమెను సంప్రదిస్తున్నారు. ఇక ఇక అమలా పౌల్ మొదట నాన్న చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరైంది.

    ఇక ''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెజవాడ'. రామ్‌ గోపాల్‌ వర్మ, కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మాతలు. ఈ నెల 12 నుంచి స్విట్జర్లాండ్‌లో పాటలు చిత్రిస్తారు. దీపావళికి సినిమా విడుదలవుతుంది.

    English summary
    Nayantara is thoroughly impressed with Amala Paul images on the magazine and she went on to an extent of sending Amala a sms and the actress who received the message has bumped over for Nayan's sms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X