దబాంగ్ రీమేక్ లో నయనతార

By Srikanya

సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ దబాంగ్ తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో గబ్బర్ సింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా ధరణి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఒరిజనల్ లో ఉన్న మలైకా అరోరా ఐటం సాంగ్ ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. అందుకే ఆ ఐటం సాంగ్ కోసం మొదట శ్రియను అడిగారు. కానీ శింబు సినిమాలో నయనతార నటిస్తే ఆ క్రేజ్ వేరని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే నయనతార గ్రీన్ సిగ్నల్ ఇంకా ఇవ్వలేదు. శ్రీరామ రాజ్యం తర్వాత నటించకుండా వివాహం చేసుకుని గృహిణిగా సెటిల్ అవుతుందని అనుకుంటే ఆమె మళ్లీ నటిస్తానని తెరపైకి వచ్చింది. దాంతో ఈ ఆఫర్ చేసారు. శింబు మాత్రం ఈ మ్యాటర్ లో తల దూర్చటం లేదు. రిచా గంగోపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ టైటిల్ తో ఆ చిత్రం తెరకెక్కనుంది. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తయ్యింది.పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X