నయనతార చివరకు అంతకు దిగజారిందా?
కుర్రకారు కలల రాణిగా ఎదిగిన నయనతార తాజాగా హన్సిక హీరోయిన్ గా చేస్తున్న చిత్రంలో ఐటం సాంగ్ చేయటానికి కమిట్ అయిందని సమాచారం. ఇంతుకుముందు ఆమె రజనీకాంత్ శివాజీ లో అంటువంటి గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చినా రజనీకాంత్ వంటి స్టార్ సినిమాలో తప్పేమీ లేదన్నారు. అయితే హన్సిక వంటి సాటి హీరోయిన్ ..ఇంకా చెప్పాలంటే తనకంటే జూనియర్ హీరోయిన్ చిత్రంలో ఐటం సాంగ్ అంటే దిగజారటమేనంటున్నారు.
హన్సిక తొలిసారి తమిళంలో నాయికగా చేస్తున్న 'మా పిళ్లైయ్' చిత్రంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరో. సూరజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓపెనింగ్‌లో వచ్చే ఓ ప్రత్యేకపాట నయనతారతో చేయించాలని ధనుష్ నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం నయనతారను రిక్వెస్ట్ చేసి ఒప్పించాడని తెలిసింది. దనుష్‌తో తనకున్న అనుబంధాన్ని దృష్టిలో వుంచుకొని నయనతార పారితోషికం గురించి కూడా మాట్లాడకుండా ఒప్పుకున్నారట. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
నయనతారను ధనుష్ సంప్రదించిన మాట వాస్తవమే అయినా నయన నుంచి ఆ పాట చేయడానికి గ్రీన్ సిగ్నల్ రాలేదని కొంత మంది అంటున్నారు. ఇత గతంలో రజనీకాంత్, అమల జంటగా రూపొందిన తమిళ చిత్రం 'మాప్పిళ్లై" ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. అల్లుడు, అత్తకీ మధ్య జరిగే పోరుతో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రంలో అత్త పాత్ర కీలకం కాబట్టి ఖుష్బూ, సిమ్రాన్లను, శ్రీదేవిని అడిగారనే వార్త ఇటీవల వచ్చింది. ఇక నయనతార హీరోయిన్ గా చేసిన అదుర్స్ చిత్రం ఈ డిసెంబర్ నెలలోనే రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











