జయం రవి భూలోగంలో ల్యాండ్ అయిన నయనతార
తిరిగి సినిమాల్లోకి వస్తున్నాను అని నయనతార ప్రకటించిందే ఆలస్యం ఆమె ముందు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అందిరిపోయే అందం, చక్కని అభినయం, యూత్ మతి పోగొట్టే హొయలు ఆమె సొంతం. అందుకే నయన తారకు అంత క్రేజ్.
ఇప్పటికే హీరో గోపీచంద్, అజిత్ కుమార్, నాగార్జున, రాణా దగ్గుబాటి సరసన బుక్కయిన నయనతార....తాజాగా జయం రవి హీరోగా రూపొందుతున్న 'భూలోగం' అనే తమిళ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఖరారైంది. తమిళ నటుడు జయం రవి హీరోగా రూపొందుతున్న 'భూలోగం' అనే తమిళ చిత్రానికి సంబంధించి ఇటీవలే దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు.
ఈ చిత్రం ద్వారా కళ్యాణ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు ఆమెకు స్కిప్టు చెప్పగా బాగా నచ్చి వెంటనే ఒకే చెప్పిందట. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవించంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయం రవి బాక్సర్‌గా కనిపిస్తాడు. విజయ్ ఆంటోని సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
తెలుగు విషయానికొస్తే.... బాలకృష్ణ తన డ్రీం ప్రాజెక్ట్ 'నర్తనశాల'ను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారనీ, అందులో ద్రౌపది పాత్రకు నయనతారను ఎంపిక చేశారనీ, ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలుగుతుందనీ భావిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











