నయనతార దుబాయి రాణి గా తమిళ ప్రేక్షకులను అలరించనుంది. అయితే అదేదో కొత్త సినిమా ఏమీ కాదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందించిన దుబాయి శ్రీను చిత్రాన్ని దుబాయి రాణి పేరుతో అక్కడ అనువదించి రిలీజు చేస్తున్నాయి. మొదట్లో ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజు అయినప్పుడు చెన్నైలో మంచి కలెక్షన్స్ సంపాదించింది. దాంతో ఈ చిత్రానికి అక్కడి ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి బాగా పెరిగింది. అలాగే దుబాయి రాణి అనే పేరు పెట్టడానికి కూడా కారణం తమిళనాడులో రవితేజ కన్నా నయనతారే పాపులర్ కావటమేనంటున్నారు. అందుకే మంచి రేటుకి డబ్బింగ్ రైట్స్ తీసుకున్నామని నిర్మాతలు చెప్తున్నారు. అలాగే ఈ సినిమాని మంచి మసాలా పాక్ గా క్కడ ప్రచారం చేస్తున్నారు. మరో ప్రక్క అక్కడ నయనతారపై తమిళ నిర్మాతల మండిలి బ్యాన్ విధించాలని యోచిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా రిలీజుకి ప్లాన్ చేయటం కొందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.