నయనతార సర్జరీ సైడ్ ఎఫెక్టు
నయనతార ఆ మధ్య బాడీ షేప్ కోసం లింపోక్షన్ ఆఫరేషన్ చేయించుకుంది. లాటిన్ బ్యూటీలా మారి కెరీర్ ని ముందుకుతీసుకెళ్తోంది. అయితే తాజాగా ఆమె ఓ తమిళ సినిమా నిమిత్తం డాన్స్, రన్నింగ్ సీన్స్ చేస్తున్నప్పుడు పొట్ట, నడు వద్ద విపరీతంగా నొప్పి ప్రారంభమయింది. దాంతో వెంటనే ఆమె తన పర్శనల్ డాక్టర్ ని సంప్రదించింది. హాస్పటల్ లో అన్ని టెస్ట్ లు చేసి ఆ నొప్పి కొవ్వు కరిగించే ఆపరేషన్ చేయించుకోవటం వల్ల వచ్చిందేనని నిర్ణయించారు. సెల్యూట్ సినిమా సమయంలో ఆమె తన బాడీ షేప్ కి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. అది ఇప్పుడు దెబ్బ కొట్టింది.
దాంతో నయనతార కుటుంబ సభ్యులుకు బెంగపట్టుకుంది. వెంటనే అమెరికా గానీ, కెనడా కానీ వెళ్ళి స్పెషలిస్టులకు చూపించాలని నిర్ణయించారు. అయితే నయనతార అలా బయిట దేశాలకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళితే అనవసరమైన రూమర్స్ వచ్చి కెరీర్ కి దెబ్బ తగులుతుందని వద్దని చెప్పిందని సమాచారం. ప్రస్తుతానికి మందులు వాడుతోందని, అది అంత సీరియస్ ఇష్యూ కాదని డాక్టర్స్ భరోసా ఇచ్చినట్లు ఆమె వర్గీయుల కథనం. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ తో అదుర్స్ లో చేస్తోంది. బాలకృష్ణతో బి.గోపాల్ చిత్రంలోనూ కమిటయ్యిందని తెలుస్తోంది. అయితే ఈ వార్త సైజు జీరో కోసం తపిస్తూ ఒళ్ళు కృత్రిమంగా తగ్గించుకున్న మిగతావారి గుండెళ్ళో రైళ్ళు పరుగెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications











