నయనతార కోసం ఆత్మహత్య !?
నయనతార ప్రేమని నిరాకరించిందని ఓ కుర్రాడు ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని ఆమే స్వయంగా చెప్తోంది. ఆమె తమిళ మీడియాతో మాట్లాడుతూ తన చిన్నప్పుడు ముచ్చట్లు చెప్పుకొచ్చిది. తనకు చిన్నప్పటినుంచి ప్రేమ లేఖలు ఎక్కువగా వచ్చేవని, వయస్సుతో సంభంధంలేకుండా ప్రపోజ్ చేసేవారని అంటోంది. తనకు గుర్తున్నంతవరకూ ఆరవ తరగతి చదివేటప్పుడు ఓ కుర్రాడు, తొమ్మిదవ తరగతిలో ఓ కుర్రాడు ఐలవ్ యు చెప్పారంటోంది.
తొమ్మిదో తరగతి కుర్రాడయితే మరింత అడ్వాన్స్ అయ్యి వెంటపడేవాడని, చివరకు నిరాకరించేసరికి ఆత్మహత్య ప్రయత్నం చేసాడని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్తోంది. ఇక పెద్దయ్యాక, ఫాన్ పాలోయింగ్ పెర్గాక చాలామంది తనను ప్రేమిస్తున్నానంటూ, పెళ్ళి చేసుకుంటానంటూ ముందుకొచ్చారని గర్వంతో చెప్తోంది. సర్లే శింబు సంగతి ఏంటి..అతన్ని నువ్వు ప్రేమించావా..అతనే నిన్ను ప్రేమించాడా అంటే కోపంగా చూసి వెళ్ళిపోయిందిట.


Click it and Unblock the Notifications











