నయనతారతో నా లవ్ స్టోరీ అందరికి తెలుసు
నయనతారకీ, నాకూ మధ్య జరిగిన ప్రేమ,ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు..అంటూ శింబు తాజాగా మీడియా ముందు మాట్లాడారు. ఆయన తాజా చిత్రం వాలీబన్ చిత్రం నయనతారతో శింబు ప్రేమ కథ అని బయిట ప్రచారం జరుగుతున్న దాని గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చారు. తనకూ, నయనతారకి జరిగింది ప్రపంచమంతా తెలుసు అనీ దానిని ప్రత్యేకంగా తెరకెక్కించాల్సిన అవసరం లేదని,అలాగే తన లేటెస్ట్ చిత్రం వాలీబన్ లో హీరోయిన్ అసలు హీరోను ప్రేమించదని ఒన్ సైడ్ లవ్ అని అన్నారు. అలాంటప్పుడు ఈ సినిమా తన లవ్ స్టోరి కి పోలిక ఏమిటీ అని అన్నారు. నయనతార తనని ప్రేమించిందని స్పష్టం చేసారు. ఇక ఈ చిత్రానికి శింబునే దర్శకత్వం చేస్తున్నారు. అలాగే మన్మధన్ కి గానీ, వల్లభన్ కి గానీ ఈ చిత్రం పోలిక ఉండదని చెప్పారు. చాలామంది మన్మధన్ కి సీక్వెల్ అంటున్నారని అది కూడా నిజం కాదని అన్నారు.
నయనతార అదుర్స్ జూ ఎన్టీఆర్ ఆంజనేయులు రవితేజ శింబు మన్మధన్ వల్లభన్ simbhu nayantara adurs jr ntr raviteja manmadhan vallabhan


Click it and Unblock the Notifications