నయనతారది ఎలాంటిదైనా..
నయనతార నటించిన ఎంత ఫ్లాఫ్ చిత్రమైనా తెలుగులోకి డబ్బింగ్ చేసేస్తున్నారు. తాజాగా ఆమె అజిత్ తో కలిసి తమిళంలో చేసిన ఆగిన్ చిత్రంని మల్లికా ఐ లవ్ యు పేరుతో అనువాదం చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం డైరక్ట్ చేసిన ఈ చిత్రం అనేక వివాదాలను ఎదుర్కోంది. అప్పట్లో షారూఖ్ ఖాన్ హిందీలో చేసిన మైహూనా కి ఇది ఫ్రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. అందులో సుస్మితా చేసిన టీచర్ పాత్రను ఇందులో నయనతార చేసింది. అలాగే హీరో తమ్ముడు పాత్రను నవదీప్ చేసారు. నయనతార, నవదీప్ ఇక్కడ పాపులర్ ఫేస్ లు కావటం, నయనతార గ్లామర్ ని ఇక్కడ క్యాష్ చేసుకోవచ్చనే థాట్ తో ఇది డబ్బింగ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం వర్కవుట్ అయితే విజయ్ తో నయనతార చేసిన విల్లు చిత్రం కూడా డబ్బింగ్ చేసే ఆలోచనలతో కొందరు ఉన్నట్లు సమాచారం. విల్లు కూడా ఫ్లాఫ్ సినిమానే కావటం విశేషం.
nayantara mallika agen ajit tamil flop ravi teja anjaneyulu నయనతార నవదీప్ మైహూనా విల్లు విజయ్ అంజనేయులు రవితేజ సెల్యూట్


Click it and Unblock the Notifications