హఠాత్తుగా నయనతార మేనేజర్ రిజైన్... కారణం
నయనతార మేనేజర్ అజిత్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే ఆమె బిహేవియర్ నచ్చటం లేదని, ఇచ్చిన మాట మీద నిలబడకపోవటంతో తాను బయిట ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని చెప్తన్నాడు. ఇక నయనతార కొద్ది రోజుల క్రితం తాను పెళ్ళి చేసుకోబోతున్నానని, ఏ కొత్త ఆఫర్స్ ఒప్పుకోవద్దని అతనికి ఆర్డర్ వేసిందిట. మళ్ళీ ఏమైందో ఆ తర్వాత మళ్లీ అతనితో..మంచి ఆఫర్స్ వస్తే వదొలొద్దని చెప్పిందిట. దాంతో కన్ఫూజ్ అయిన అజిత్ కొన్ని సినిమాలు ఒప్పుకుని వచ్చాట్ట. అయితే నయనతార మొదట సరేనని ఆ తర్వాత వాళ్ళెదురుగానే..అజిత్ పై మండిపడిందిట. మరో ప్రక్క రీసెంట్ గా ప్రభుదేవా..ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తున్నాట్ట. ప్రభుదేవా చెప్పిన మీదటే ఆమె ఓ యాడ్ ఫిల్మ్ ఒప్పుకుని, షూటింగ్ కు హాజర్ అయిందిట. దాంతో అజిత్ కేటాయించిన కాల్ షీట్స్ సమస్య వచ్చి అందరి చేతా తిట్లు తిన్నాట్ట. ఇవన్నీ గమనించిన అజిత్...తాను రిజైన్ చేయనున్నానని చెప్పి, కొత్త మేనేజర్ వచ్చి జాయిన్ అయ్యేదాకా కంటిన్యూ అవుతానని అని చెప్పాట్ట..అది సంగతి.


Click it and Unblock the Notifications











