నయనతార కమల్ హాసన్ లిప్ట్ ఇవ్వనున్నాడా?
కమల్ హాసన్ తాజాగా నయనతారను తన లేటెస్ట్ చిత్రంలో తీసుకోవటానికి అంగీకరించాడనే వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఆయన చేయతలబెట్టిన రొమాంటిక్ కామిడీలో హీరోయిన్ గా మొదట తమన్నా అయితే బాగుందనుకున్నారు. అయితే ఆమె కమల్ ప్రక్కన తేలిపోతుందని నయనతార అయితే సరిపోతుందని ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అందులోనూ నయనతార ఈ మధ్యనే రిలీజైన రవికుమార్ ఘటికుడు చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అప్పటి అనుబంధం దృష్ట్యా ఈ లీడ్ రోల్ ని ఆమెకు ఆఫర్ చేసినట్లు చెప్తున్నారు. ఇక కమల్ హాసన్ తో రవికుమార్ గతంలో తెనాలి, దశావతారం, పంచతంత్ర వంటి చిత్రాలు రూపొందించారు. అలాగే ఈ లేటెస్ట్ చిత్రాన్ని ఉదయనిధి నిర్మిస్తున్నారు. ఆయన కూడా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారు కాబట్టి నయనతార అయితే మార్కెట్ కూ ఇబ్బంది ఉండదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంతో నయనతార తిరిగి తన పాత వైభవాన్ని పొందుతానని ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications











