నయనతార నెక్ట్స్ ఆ తెలుగు హీరో సరసన
బాలయ్య..సూపర్ హిట్ సింహాతో మరోసారి క్రేజ్ తెచ్చుకున్న నయనతార మరో తెలుగు చిత్రంలో బుక్కయింది. తమిళ దర్శకుడుకన్నన్ రూపొందించనున్న ద్వి బాషా చిత్రానికి ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. తెలుగు వెర్షన్ కి హీరోగా మంచు విష్ణు వర్ధన్ ని తీసుకున్నట్లు సమాచారం. తమిళంలో హీరోగా ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడు జీవా చేస్తున్నారు. నయనతార మాత్రం రెండు వెర్షన్ లోనూ హీరోయిన్ గా చేస్తోంది. తమిళంలో ఈ చిత్రం టైటిల్...వందన్ వేంద్రన్. రెండు వెర్షన్ లు ఒకేసారి షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక నయనతార ..ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మర్యాద రామన్న చిత్రంలో ఓ ఐటం సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక విష్ణు వర్దన్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు హేమంత్ మధుకర్ తో సినిమా చేస్తున్నారు.హేమంత్ మధుకర్ గతంలో 'ఫ్లాట్' అనే థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'సలీం' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచు మనోజ్ కు ఆ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.


Click it and Unblock the Notifications











