బాలీవుడ్ కీ ఇక 'నయన' ఆనందం

దాన్ని ఇప్పుడు హిందీలో రాజ్ కుమార్ సంతోషి చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నాడు. 'హల్లాబోల్' చిత్రం పరాజయంతో చల్లబడ్డ ఆయనని ఈ తమిళ రీమేక్ బాగా ఆకట్టుకుందిట. అంతేగాక అందులో నయనతార నయనాందకర అందాలు మరీ నచ్చేసాయట. దాంతో చేస్తే ఆమెతోనే చెయ్యాలని నిర్ణయానకి వచ్చాడట. అసలు అంతకు ముందే ఆమె 'భిల్లా' చిత్రంలో లేడీ గ్యాంగస్టర్ గా అందాలు ఆరబోసి,బికినీతో కనిపించేసి అదరకొట్టేసింది. కాని చిత్రంగా 'యారాడి నీ మోహినీ' లో మన తెలుగులో త్రిష చేసిన పాత్రం లో ఆమె ఒదిగిపోయి...పూర్తి కాంట్రాస్ట్ ఉన్న విధంగా కనపడి అందరినీ షాక్ కి గురిచేసింది.
అయినా రాజ్ కుమార్ సంతోషి ...అసలు నయనతార లాంచింగ్ ఫిలిం చేయాలట. అప్పట్లో యేవో అడ్డంకులు వచ్చి మిస్సయింది. దాంతో ఆమె కూడా మెదట తనని డిస్కవరి చేసిన ఆయనతో చేయాలని ముచ్చటపడుతోందిట. త్వరలోనే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications











